18 November 2010

దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీజాన్

దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీజాన్
వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహం అనే మాటలో చెరో అక్షరం మనం ||దోస్త్||

నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటాం ఆహాహా ఏహే హే హే హే
నిజంలో ప్రతిక్షణం కలలకే కలలవుతాం ఓహొహొ ఆహాహా ఆహా
హేమేడల్లే నే నొదిగుంటూ నువ్వు ఎదుగుతువుంటే మబ్బుల్తో మన కధ
చెపుతా వింతగ వింటుంటే నీలా నాలా సాహసంగా నింగీ నేల కలవాలంటూ
మబ్బే కరిగి ఇలపై జలైరాదా మన్ను మిన్ను కలిపే హరివిల్లవదా ||దోస్త్||

చరిత్రే శిరసొంచి ప్రణామం అంటుంది
హేయ్ ప్రాణానికి ప్రాణం పోస్తే మంత్రంరా స్నేహం
ఊరువాడ ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాదా నేస్తం కాలం
చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరోవేదం ||దోస్త్||

No comments:

Post a Comment