మావా ఆ ఓ మావా ఆ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా
పచ్చనాకు మీద ఆన
పసుపు కొమ్ము మీద ఆన
పరమాత్ముని మీద ఆన
పరువాల మీద ఆన
ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
సుక్కా పొద్దు ఆరతిలో సిరుముద్దు పూజలలో
నా సామివి నువ్వే వడి గుడిలో
సల్లాగాలి మేళం లో సరసాల తాళం లో
నాదానివి నువ్వే గుండెలలో
హా ఉన్న సొగసు మీద ఆన
లేని నడుము మీద ఆన
నువు లేక ఉండలేని ప్రాణాల మీద ఆన
నేను నువ్వే నావీ నీవే మావా
ఓ భామా ఆ ఓ భామా ఆ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
కుంకుమబొట్టే నలుపాయే నా కాటుక ఎరుపాయే
కరగాలని నీ బిగి కౌగిలిలో
సీకటి సెట్టే సిగురైతే సిగురంతా ఎలుగైతే
నిలవాలిక ఎలుగుల సీమలలో
హా బ్రహ్మరాత మీద ఆన
భరతమాత మీద ఆన
మువ్వన్నెల మీద ఆన
మన బంధం మీద ఆన
నలుపులు మనవే గెలుపులు మనవే మావా
ఓ భామా ఆ ఓ భామా ఆ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా
No comments:
Post a Comment