18 August 2010

ఓ మరమనిషి మాలోకి రా

ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా

ఇనుముతో సిలికాన్ చేర్చి
తీగలతో తెరిపించి
హార్డ్డిస్క్ తో మెమరీ కుర్చీ
చనిపోని దేహంతో
చెడిపోని ప్రాణంతో
ఆరోజ్ఞానం నీకై నేర్పితే విజ్ఞానం
నిలిపే ప్రయత్నం
ఓ మరమనిషి మాలోకి రా

ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా

మార్గం చూపుము
మనిషిని బాగుచేయి
మమతే నేర్పుతూ
జగమే మార్చు
ప్రాణి కోటికి
మంచి కోరుకో
నిజాయితిని యెన్నడూ వీడకు

యంత్రుడా యంత్రుడా యంత్రుడా నా యంత్రుడా
యంత్రుడా యంత్రుడా యంత్రుడా నా యంత్రుడా

నా తెలివి ఇంతే కదా
నీ జ్ఞానము ఎంతో కదా
నా భాషలు ఆరు సరి
సృష్టించావ్ నూరు మరి
ఊపిరి తిత్తులు వుండవులే
గుండె బాధ లేదసలే
జిత్తుల మనిషి అల్పుడులే
యంత్రము ఓడదులే

గర్భంలో జనించేవి అన్నీ గతించు
మేధలో పుట్టినచో మృత్యువే లేదు
ఇదిగో నా యంత్రుడు మృత్యుంజయుడు
ఇదిగో నా యంత్రుడు మృత్యుంజయుడు

నేను మరో బ్రహ్మనులె
నీవే నా పుత్రుడివే
మగాడు కన్న మగవాడ
నీ పేరిక యంత్రుడులే

ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా

నేనొక మేధో భాష
ఎందుకు అనటం నా శ్వాస
రోదసి వల్లె నా నయనం
నే రేపటి విజ్ఞానం
నీ కండలు రక్తగతం
నా గుండెలు వస్తుశతం
నీ జన్మం ఒకటే కదా
నా జన్మలు వేరు కదా

రోబో రోబో పలు బాషలు వస్తే యే
నా పిత్రుభాష తెలుగు కదా
రోబో రోబో లోకం గెలిచోస్తే యే
సృష్టికర్తకు ఎప్పుడూ దాసుడే

ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా

No comments: