ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మా నాన్నలు
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మా నాన్నలు
మర్యాదల గిరి దాటని నాన్నే మా నడతగా
గిరి గీయని మనసున్న అమ్మే మా మమతగా
తరువే సంపదగా పగలే వెన్నెలగా
ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా
ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా
పెరిగినాము నీ నీడనా ముద్దు ముద్దుగా ఆ ఆ
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మా నాన్నలు
అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా ఆ
కన్నతల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా
ఒకటే తనువుగా ఒకటే మనసుగా
చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగ
చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగ
కలిసివున్నాము కన్నవారి కనుపాపలుగా
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు
మా అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు
No comments:
Post a Comment