చిన్ని నవ్వు జల్లిపోవే ప్రియతమా
చందనాలు చిందిపోవే ప్రాణమా
బిందువై నను తాకిపోవే ప్రియతమా
సింధువై మది నిండిపోవే ప్రాణమా
హ్రుది వాణివై హ్రుదయానివై
ఈ హాయిలో కిరణానివై
నా కంటి పాపల్లో దీపాల వెలుగై
నా గుండె లోతుల్లో స్వప్నాల జడివై
నిను చూస్తు కూర్చుంటె ఓ సంబరం సంబరం సంబరం
నా చెంతే ఉన్నట్టు ఆ అంబరం అంబరం అంబరం
నీ రూపు కలలెన్నో వెదజల్లి పోయిందీ
ఎద ఏంటి మేఘంలా ఎగిరెళ్ళి పోతోందీ
సఖి నువ్వే నాలోని అలజడికే ఆకారం
నువు కాదా లోలోనే తొలి ప్రేమకు శ్రీకారం
నాలోని భావాలు ఇక తెలిపేదేలా
ప్రతిరోజు నిదురల్లో ఓ కలవరం కలవరం కలవరం
కెరటాలై పొంగింది మది సాగరం సాగరం సాగరం
మనసేమొ చిత్రంగా నిన్నేలే అడిగిందీ
ఎద ఏమో ఆత్రంగా నీకోసం వెతికిందీ
అణువణువుని జత చేసి నిర్మించా గోపురమే
నువు చిందే చిరునవ్వే నా పాలిట ప్రియ వరమే
నాలోని భావాలు ఇక తెలిపేదేలా
No comments:
Post a Comment