నవమన్మధుడ అతి సుందరుడ నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రిరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు
గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనే
వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనే
రతి రాగలే శ్రుతి చేసాడే జత తాళలే జతులాడాడే
తనువంత వింత సంగీతమేదొ పలికే
అక్కా ఎవరే
శ్రి రాఘవుడ
వాడి చూపుల దాడితో వేది ఆవిరి రేపెనే నిలువేల్ల తారాడెనే
చాటు మాటున చోటులో ఘాటు కోరిక లూగెనె వొడి చేరి తలవల్చెనే
జడ లాగాడే కవ్వించాడే నడు వోంపుల్లో చిటికేసాడే
అధరాల తోనె శుభలేఖ రాసె మరుడే
చెల్లి
నవ మన్మధుడ
No comments:
Post a Comment