మెల్లగ కరగని రెండు మనసుల దూరం
చల్లగ తెరవని కొంటె తలపుల ధ్వారం
వలపు వాన గారాలే పంపుతున్నది ఆకసం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం
తడిపె తడికి తనతో నడిపి హరివిల్లుని వంతెన వేసిన శుభవేలా
ఈ వర్షం సాక్షిగ తెలపని నువు నాకె సొంతం
ఈ వర్షం సాక్షిగ కలపని బంధం
నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న
ఈ తొలకరిలో తల తల నాట్యం నీదేన
ఆ ఉరుములు లోన నీ పిలుపులు వింటున్న
ఈ చిట పటలో చిటికెల తాళం నీదేన
మతి చెడే దాహమై అనుసరించి వస్తున్న
జత పడే స్నేహమై అనునయించన
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిన్ను విడదా
ఈ పెనుమరుగైన ఈ చొరవను ఆపేన
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్న
యే చిరు చినుకైన నీ సిరులను చూపేన
ఆ వరుణికె రునపడిపోన ఈ పైన
త్వరపడె వయసునే నిలుపలేను ఇకపైన
విడుదలే వద్దని ముద్దులెయ్యనా
మన కలయిక చెదరని చెలిమి రుజువని చెరితలు చదివేలా
No comments:
Post a Comment