14 March 2010

నీవేనా నను తలచినది

నీవేనా నీవేనా నను తలచినది
నీవేనా నను పిలచినది
నీవేనా నా మదిలో నిలిచి
హృదయము కలవరపరచినది నీవేనా

నీవేలే నను తలచినది
నీవేలే నను పిలచినది
నీవేలే నా మదిలో నిలిచి
హృదయము కలవరపరచినది నీవేలే

కలలోనే ఒక మెలకువగా
ఆ మెలకువలోనే ఒక కలగా
కలలోనే ఒక మెలకువగా
ఆ మెలకువలోనే ఒక కలగా

కలయో నిజమో వైష్ణవమాయో
తెలిసి తెలియని అయోమయంలో

నీవేనా నను తలచినది
నీవేనా నను పిలచినది
నీవేనా నా మదిలో నిలిచి
హృదయము కలవరపరచినది నీవేనా

కనుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి
కనుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి

కనులను మనసును కరిగించి
మైమరపించి నన్నలరించి

నీవేలే నను తలచినది
నీవేలే నను పిలచినది
నీవేలే నా మదిలో నిలిచి
హృదయము కలవరపరచినది నీవేలే
నీవేలే

No comments: