02 March 2010

కలికి చిలకలకొలికి మాకు మేనత్త

కలికి చిలకలకొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకాజాక్షి

మేనాలు తేలేని మేనకోడలిని
అడగవచ్చా మిమ్ము ఆడకూతిర్ని
వాల్మీక మేలించు వరస తాతయ్యా
మయ ఇంటికంపించ వయ్య మావయ్యా

ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మ నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసి
పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపాలా కాపురం చేసే
మా చన్టి పాపను మన్నించి పంపు


మసక బడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనెనీరెన్డ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయోధ్య నేలేటి సాకేతరామా

No comments: