చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడూ ఓ వానా నువు వస్తానంటే
నిధులకు తలుపులు తెరవగ ఒక ఆలీబాబా మనకే ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లవుద్దీన్ చాపే ఉంటే
చూపదా మరి ఆ మాయా దీపం మన ఫేటే ఫ్లైట్ అయ్యే రన్ వే
నడి రాత్రే వస్తావే స్వప్నమా
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా
ఉరికినె ఉరిస్తావె మిత్రమా
సరదాగ నిజమైతే నష్టమా
మోనాలిసా మొహమ్మీదే నిలుస్తావా ఓ చిరునామా ఇలా రావా !
వేకువనే మురిపించే ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులూ
లోకం లో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులూ
ఇలాగేనా ప్రతీ రోజూఎలాగైనా ఏదో రోజు మనదై రాదా
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
No comments:
Post a Comment