నేల మీది జాబిలి
నింగి లోని సిరి మల్లి
నా చెలి నెచ్చెలి
చేరుకొరావా నా కౌగిలి
పిలిచెను కౌగిలింత రమ్మనీ.. ఊరుకొమ్మని
తెలిపెను పులకరింత ఇమ్మనీ.. దోచి ఇమ్మని
మనసుకు వయసు వచ్చు తీయని రేయిని
వయసుకు మతిపొయి పొందని హాయిని
తొలి ముద్దు ఇవ్వనీ మరు ముద్దు కొసరని
మలి ముద్దు ఏదని మైమరచి అడుగనీ || నేల మిది||
వెన్నల తెల్లబొయి తగ్గనీ .. తనకు సిగ్గనీ
కన్నులు సిగ్గు మాని మొగ్గనీ .. కలలు నెగ్గనీ
పరచిన మల్లె పూలు ఫక్కుమని నవ్వనీ
పగటికి చోటివ్వక ఉండనీ రత్రినీ
దీపలు మలగనీ తాపాలు పెరగనీ
రేపన్నదానిని ఈ పూటే చూడనీ || నేల మిది||
No comments:
Post a Comment