ద్వాపరమంతా సవతుల సంత జ్ణ్యాపకముందా గోపాల
కలియుగమందు ఇద్దరిముందు శిలవయ్యావే శృఇలోలా
కాపురాన ఆ పదలను ఈడిన శౌడి ఏది నాకు చూపవా ఒకదారి
నారీ నారీ నడుమ మురారి
నారీ నారీ నడుమ మురారి
ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా
ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా
వలపునవానల జల్లులలో స్వామి తలమునకలుగా తడిసితివా
చిరుబురులాడేటి శృఇదేవి నీ శిరసును వంచిన కథకన్న
రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసిన కథవిన్నా
గోవిందా గోవిందా గోవిందా
సాగిందా జొడుమద్దెల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం
ఇంటిలోన పోరంటే ఇంటింట కాదయ్య అన్నాడు ఆ యొగి వేమనా
నాతరమా భవసాగరమీదను అన్నాడు కంచర్ల గోపన్న
పరమేశా గంగనిడుము పార్వతి చాలును
ఆ మాటలు విని ముంచకు స్వామి గంగను
ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా
భామ కాలు తాకిందా కృఇష్ణుడే గోవిందా అన్నాడు ఆ నంది తిమ్మన్నా
ఒక మాట ఒక బాణం ఒక సీత నాదని అన్నడు సాకేతరామన్నా
యెదునాధా భామనిడుము రుక్మిణి చాలున్
రఘునాధ సీతను గొనివిడు సూర్ఫణఖను
రాసలీల లాడాలని నాకు లేదులే
భయభక్తులున్న భామ ఒకటే చాలులే
రాసలీల లాడాలని నాకు లేదులే
భయభక్తులున్న భామ ఒకటే చాలులే
No comments:
Post a Comment