వాడుక మరచెదవేల నను వేడుక చేసెదవేల
నిను చూడాని దినము నాకోక యుగము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము
వాడుక మరువను నేను నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము
సంధ్య రంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము
తేనె విందుల తీయని కలలు మరచి పోయిన వేళ ఇక మనకీ మనుగడ యేల
ఈ అందము చూపి డెందము వూపి ఆశ రేపెద వేల ఆశ రేపెదవేల
సంధ్య రంగులు సాగినా చల్ల గాలులు ఆగినా
కలసి మెలసిన కన్నులలోన మనసు చూడగ లేవా మరులు తోడగ లేవా
కన్నుల ఇవి కలల వెన్నెల చిన్నె వన్నెల చిలిపి తెన్నుల
మనసు తెలిసి మర్మమేల ఇంత తొందర యేలా ఇటు పంతాలాడుట మేలా
నాకందరి కన్నా ఆశలు వున్నా హద్దు కాదనగలనా హద్దు కాదనగలనా
వాడని నవ్వుల తోడ నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లొకము మరచి ఎకమౌదము కలసీ ఎకమౌదము కలసి
No comments:
Post a Comment