13 February 2010

శంభో శివ శంభో శివ శంభో శివ శంభో

శంభో శివ శంభో శివ శంభో శివ శంభో
వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో
వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో

అందాన్ని కాదన్న ఆనందం లేదన్న
బంధాలు వలదన్న బ్రతుకంతా చేదన్న
సిరులున్నా లేకున్నా చెలితోడు నీకున్నా
అడవిలో నువ్వున్నా అది నీకు నగరంరా

వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో

ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న
ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న
నీదన్న నాదన్న వాదాలు వలదన్న
ఏదైనా మనదన్న వేదాన్నే చదువన్న
ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న
శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న
భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న
ఈనాడు సుఖమన్న ఎవడబ్బ సొమ్మన్న

వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో

No comments: