చెలిమిలో వలపు రాగం
వలుపులో మధుర భావం
రాగం భావం కలిసే ప్రణయ గీతం
పాడుకో ర ప ప పా పాడుకో ర ప ప పా
పాడుకో
1|| ఉయ్యాలలూగినాను నీ ఊహలో
నెయ్యాలు నేర్చినాను నీ చూపులో
ఆరాధనై గుండెలో
ఆలాపనై గొంతులో
అలల లాగా కలల లాగా
అలల లాగా కలల లాగా కదలీ రాదా
2|| నులి వెచ్చనైనా తాపం నీ స్నేహమూ
ఎద గుచ్చుతున్న భావం నీ రూపమూ
తుది లేని ఆనందము తొణుకాదు సౌందర్యము
శృతిని చేర్చి స్వరము కూర్చి
శృతిని చేర్చి స్వరము కూర్చి పదము కాగా
No comments:
Post a Comment