వేదంలా ఘోషించే గోదావరి అమరధామమ్ లా శోభించే రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం
రాజ రాజ నరేంద్రుడు కాకతీయులూ తేజమున్న మేటి దొర లు రెడ్డి రాజులు
గజపతులు నరపతులూ ఏలీనా వూరు
ఆ కధలన్నీ నినదించే గౌతమి హోరు
1|| ఆది కవిత నన్నయ్యా వ్రాసేనిచట
శ్రీనాధ కవి నివాసము పెద్ద ముచ్చటా
కవి సార్వ భౌములకిది ఆలవాలము
నవకవితలు వికసించే నందన వనము
2|| దిట్ట మైన శిల్పాల దెవళాలు
కట్టు కధల చిత్రాంగి కనక మే డలు
కొట్టు కొని పోయే కొన్ని కోటి లింగాలు
వీరెసలిన్గమొకడు మిగిలేను చాలు
No comments:
Post a Comment