23 July 2010

నీవు లేక వీణ పలుక లేనన్నది

పల్లవి:

నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది ఆ ఆ ఆ అ
నీవు లేఖ వీణ

చరణం1:

జాజి పూలు నీకై రోజు రోజు పూచే
చూచి చూచి పాపం సొమ్మసిల్లి పోయే
చందమామ నీకై తొంగి తొంగి చూచి
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసను లేవని అలుకలు బోయే
నీవు లేఖ వీణ

చరణం2:

కలలనైన నిన్ను కన్నుల చూదమన్న
నిదుర రాని నాకు కలలు కూడ రావే
కధ లేని కాలం విరహ గీతి రీతి
కధ లేని కాలం విరహ గీతి రీతి
పరువము వృధగా బరువుగ సాగే
నీవు లేఖ వీణ

చరణం3:

తలుపులన్ని నీకై తెరచి వుంచినాను
తలపులేన్నో మదిలో దాచి వేచినాను
తాపం ఇంక నేను ఓపలేను స్వామి
తాపం ఇంక నేను ఓపలేను స్వామి
తరుణిని కరుణను ఏలగ రావా

నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది ఆ ఆ ఆ అ
నీవు లేఖ వీణ

No comments: