21 July 2010

మా ఇంటిలోన మహలక్ష్మి నీవే--Kondaveeti Simham

పల్లవి:

మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా ఇంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే
నీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే

చరణం1:

గోరంత పసుపు నీవడిగినావు
నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు
క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం
త్యాగాలమయమై సంసారబంధం
నీ చేయి తాకి చివురించె చైత్రం
ఈ హస్తవాసే నాకున్న నేస్తం
అనురాగ సూత్రం

మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా ఇంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు మీడే
మీ కంట తడిని నే చూడలేను

చరణం2:

మా అమ్మ నీవై కనిపించినావు
ఈ బొమ్మనెపుడో కదిలించినావు
నిను చూడగానే పొంగింది రక్తం
కనుచూపులోనె మెరిసింది పాశం
నీ కంటి చూపే కార్తీకదీపం
దైవాలకన్న దయ ఉన్న రూపం
ఈ ఇంటి దీపం

మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా ఇంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు మీడే
మీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా ఇంట వెలిగే గృహలక్ష్మి నీవే

No comments: