22 July 2010

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు

పల్లవి:

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బందీవై చూడు హాయి సందిట్లో బందీవై చూడు సయ్యాటలాడి చూడు
కళ్ళలో కళ్ళు పెట్టి చూసా
గుండెల్లో గుండి కలిపి చూసా
సందిట్లో బంధీనై పోతా
సందిట్లో బంధీనై పోతా సయ్యాట వేళ కాదు

చరణం1:

కానుకా ఇవ్వనా వద్దులే దాచుకో
కోరికా చెప్పనా అహ తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు వుండవా హద్దులు
కాదులే కలిసిపో అహ నవ్వరా నలుగురు
కావాలి కొంటె సాకు హో

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఉహు
గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బందీవై చూడు అబ్బ
హాయి సందిట్లో బందీవై చూడు సయ్యాటలాడి చూడు
హై కళ్ళలో కళ్ళు పెట్టి చూసా
గుండెల్లో గుండి కలిపి చూసా
సందిట్లో బంధీనై పోతా
సందిట్లో బంధీనై పోతా సయ్యాట వేళ కాదు

చరణం2:

నువ్వు నా జీవితం నువ్వు నా ఊపిరి
నువ్విలా నేనిటు ఏండలో చీకటి
పాలలో తేనెలా ఇద్దరం ఒక్కటి
లోకమే మరిచిపో ఏకమై కరిగిపో
ఏడబాటు మనకు లేదు

హొయ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసా
గుండెల్లో గుండి కలిపి చూసా
సందిట్లో బంధీనై పోతా
సందిట్లో బంధీనై పోతా సయ్యాట వేళ కాదు
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బందీవై చూడు
హొయ్ సందిట్లో బందీవై చూడు సయ్యాటలాడి చూడు

No comments: