21 July 2010

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే--Kula Gotrallu

పల్లవి:

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే
ఉన్నది కాస్తా వూడింది సర్వమంగళం పాడింది
ఉన్నది కాస్తా వూడింది సర్వమంగళం పాడింది
పెళ్ళాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయింది
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

చరణం1:

ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయి
ఓటమి తప్పలేదు భాయి
మరి నువు‌ చెప్పలేదు భాయి
అది నా తప్పుగాదు భాయి
తెలివి తక్కువగ చీట్లపేకలో దెబ్బతింటివోయి
బాబూ నిబ్బరించవోయి
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

చరణం2:

నిలువుదోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది,ఎంతో పుణ్యం దక్కేది
గోవింద, గోవిందా
నిలువుదోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది,ఎంతో పుణ్యం దక్కేది
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లో ఖర్చుపెడితే ఎంఎల్‌ఏ దక్కేది
మనకు అంతటి లక్కేది
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

చరణం3:

గెల్పూ ఓటమీ దైవాధీనం చెయ్యితిరగవచ్చు
మళ్ళీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడెవడిచ్చు
ఇల్లు కుదవ చేర్చవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు
పోతే... అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

No comments: