పల్లవి:
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీత
ఓనమ:శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం

ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత ఆ ఆ ఆ
చరణం1:
నవ్విస్తూ నడిపిస్తా పనిపాటలు
నేను కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు
మమతల మారాజులులే ఈ అన్నలు
పసి మనసున్న మల్లికలే ఆ చెల్లెలు
పెంచానండి కండ ఆ కండల్లోనే గుండె
మీరే నాకు అండ మీరంతా చల్లంగుండ
అహ ఏగానైనా మాగాణైనా ఎంతో కొంత ఉండాలండి
ఉంది మనసుంది
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీత
ఓనమ:శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత ఆ ఆ ఆ ఓ ఓ
చరణం2:
గుళ్ళోకి పోలేదు నేనెప్పుడు
అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు నా దేవుడు
బళ్ళోకి పోలేదు చిన్నప్పుడు
పల్లె పాఠాలే నేర్చాడు ఈ భీముడు
నీ పాదాలంటే చోటే నే పాగా వేసే కోట
చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట
పలుకాకులలో పుట్టానండి కోకిలగా మారానండి
కాకా ఇది కుకు
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీత
ఓనమ:శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం
ఓనమ:శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత ఆ ఆ ఆ ఓ ఓ
2 comments:
super song idi. one of my fav song
super lyrics...
Post a Comment