21 July 2010

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది--Chaduvukunna Amayillu

పల్లవి:

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనె అంతులేని అర్ధమున్నది,అర్ధమున్నది
మొదటిరోజు కోపం అదొరకం శాపం
పోను పోను కలుగుతుంది భలే విరహతాపం
బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు,పొత్తు కుదరదు

చరణం1:

పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల తగలగానే లోన లొటారం
పడుచువాడి ఒహొ పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల తగలగానే లోన లొటారం
వగలాడి తీపితిట్టు తొలివలపు తేనె పట్టు
ఆ తేనెకోరి చెంత చేర చెడామడా కుట్టు
అహ బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు,పొత్తు కుదరదు

చరణం2:

పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలు
కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలు
తమ కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
వేడుకున్న రోషం అది పైకి పగటి వేషం
వెంటపడిన వీపు విమానం

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనె అంతులేని అర్ధమున్నది,అర్ధమున్నది

చరణం3:

చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనది
అది చిక్కుపెట్టు క్రాసువర్డు పజిలు వంటిది
చిలిపి కన్నె ఉహు చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనది
అది చిక్కుపెట్టు క్రాసువర్డు పజిలు వంటిది
ఆ పజిలు పూర్తిచేయి,తగుఫలితముండునోయి
మరుపురాని మధురమైన ఫ్రైజు దొరుకునోయి

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనె అంతులేని అర్ధమున్నది,అర్ధమున్నది
ఆ ఆ బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు,పొత్తు కుదరదు

No comments: