23 April 2010

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం నువ్వు దూరమైతె బతకగలనా

ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

గోరువెచ్చని ఊసుతో చిన్నబుచ్చకనీ వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లలరల్లరి సాగించాలి
ఏకమయె ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉందీ నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం నువ్వు దూరమైతె బతకగలనా

ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం నువ్వు దూరమైతె బతకగలనా

ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

22 April 2010

మధురం మధురం మధురం మధురం

మధురం మధురం మధురం మధురం
మధురం మధురం మధురం మధురం

ప్రణయం మధురం కలహం మధురం
క్షణము సగము విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం

సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం

అందం అందం అని ఊరించే
అందాలన్ని అసలే మధురం

శ్రవణం మధురం నయనం మధురం
కులుకే మధురం కురులే మధురం
గమనం మధురం జగనం మధురం
లయలో సాగే పయనం మధురం

గమనం మధురం జగనం మధురం
లయలో సాగే పయనం మధురం
ఎదరే ఉంటే ప్రతిది మధురం
చెదిరే జుట్టు చమటే మధురం

సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగరమధనం
సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగరమధనం

అన్నీ మధురం అఖిలం మధురం
ఆమే మధురం ప్రేమే మధురం
కనులే మధురం కలలే మధురం
కొంచెం పెరిగే కొలతే మధురం

మనసే మధురం సొగసే మధురం
విరిసే పెదవుల వరసే మధురం

ఉదయం దాచే మధురిమ గాని
ఉదరం మధురం హృదయం మధురం

తాపం మధురం శోకం మధురం
అలకే చిలికే కోపం మధురం
అలుపే మధురం సొలుపే మధురం
అతిగా మరిగే పులుపే మధురం

అధరం మధురం వ్యధనం మధురం
వెలుగే చిలికే తిలకం మధురం
బాల మధురం డోలా మధురం
లీల మధురం హేలా మధురం

జోజో మధురం జోలా మధురం
మనువాటకిదే ఫలితం మధురం

మధురం మధురం ప్రణయం మధురం
మధురం మధురం విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం

సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
అన్ని మధురం అఖిలం మధురం
మనమే మధురం ప్రేమే మధురం

కంటేనే అమ్మ అని అంటే ఎలా

కంటేనే అమ్మ అని అంటే ఎలా
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా

కణకణలాడే ఎండకు శిరసు మాడినా
మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
చారేడు నీళ్ళైన తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు
ఋణం తీర్చుకోలేను ఏ జన్మకు

ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా
మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే
సిరుల ఝల్లులో నిత్యం పరవసించినా
మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
ప్రతి తల్లికి మమకారం పరమార్ధం
మదిలేని అహంకారం వ్యర్ధం వ్యర్ధం

కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా

ఢోలారే ధుమారం దేఖోరే

ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే
ఝూమోరే ఝమాఝం నాచోరే
హుర్రే హుర్రే అనదా ఊపిరే
అరె పిల్లగాలి పలికిందా సన్నాయి పాటలా
అరె కళ్ళలోన కులికిందా హరివిల్లు నేడిలా
కింద మీద చూడనంటు సందడేదొ ఆగనంటు
బొంగరాల గింగిరాల చందనాలు రేగు వేళ

మనింటిలో వేడుక విన్నంతటా హంగామా
కళ్యాణమే చూడగ ఖంగారు కలిగిద్దామా
జగాలకే చాటుగా జువ్వల్ని ఎగరేద్దామా
చుట్టాలుగా చేరగా చుక్కల్ని దిగమందామా
ఈవాళే రావాలి పగలే ఇలా
రంగేళి రేగాలి నలువైపులా
నింగి నేల ఏకమైన రంగ రంగ వైభవాన
ఛంగు ఛంగు ఛంగుమంటు చిందులాట సాగువేళ

ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే

పొద్దెక్కినా లేవక బజ్జోకుమా పాపాయి
నెత్తెక్కి తొక్కేతనం అత్తింటిలో ఆపేయి
కుర్రాళ్ళతో దీటుగ కుంగ్ఫులవీ మానేయి
ఎన్నాళ్ళే ఈ వాలకం ఇల్లలుగా అడుగెయ్యి
అమ్మయ్యి లోకాన్నే అమ్మాయివై
తీరంత మార్చాలి ఆరిందవై
పిల్లతాను నీ బడాయి చెల్లదింక ఆకతాయి
అల్లరంత ఇక్కడొదిలి పల్లకీని చేరువేళ

ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే

చాల్లేగాని ఏంటా పరాకు

చాల్లేగాని ఏంటా పరాకు
ఉన్నట్టుండి ఏమైంది నీకు
అయ్యో అని worryఐపోకు
tell me అని enquiryలన్ని ఎందుకు
మాతోనే నువ్వుంటూ మా ఊసే పట్టనట్టు
ఏదోలా ఎందుకుంటావ్ నీదీలోకం కాదన్నట్టు
ఒదిగుందే లోని గుట్టు
కదిలిస్తే తేనె పట్టు
వదలదుగా వెంటపడుతు
నాకేం తెలుసిది ఇంతేనంటు
మునిగేదాక లోతన్నది
కొలిచే వీలు ఏమున్నది
పరవాలేదు అంటున్నది
ప్రేమలో పడ్డది

ఆమె చెంపలా కందిపోవడం
ఏమి చెప్పడం ఎంత అద్భుతం
అందుకే కదా కోరి కోరి కయ్యాలు
అతని కోసమే ఎదురుచూడటం
బ్రతిమలాడి తను అలక తీర్చడం
పూట పూట ఎన్నెన్ని చిలిపి కలహాలు
జంటలెన్ని చెబుతున్నా
ఎన్ని కథలు వింటున్నా
అంతుబట్టదే ప్రేమ ఏనాటికైనా
విన్నాగాని అంటావేగాని
ఏమంటోంది ఆకాశవాణి
చూసాగాని వేరే లోకాన్ని
ఏంచెప్పాలి చూపించే వీలులేదని

పక్కకెళ్ళిపో పాడు మౌనమా
కరగవెందుకే కొద్ది దూరమా
బయటపడని జత ఏదో చూసుకోరాదా
ఎంతసేపు ఈ వింత dilemma
కథని కాస్త కదిలించు కాలమా
to be not to be debate ఎంతకీ తెగదా
కొత్త దారిలో నడక
ఇప్పుడిప్పుడే గనక
తప్పదేమో తడబడక
అలవాటు లేక

ఇన్నాళ్ళుగా ఉన్నాగా నేను
నువ్వొచ్చాక ఏమైపోయాను
నీతో ఇలా అడుగేస్తున్నాను
ఏవైపంటే ఏమో ఎలాగ చెప్పను

నేనని నీవని వేరుగా లేమని

నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయేనా

పథము నాది పరుగు నీది
రథము వేయరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా

అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు

అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా

ఓ నిమిషమైనా నిదరపోవా
నిలవనీవేం నిరీక్షణమా
నే వెతుకుతున్నా ఎదుటపడవే తొలి వెలుగు తీరమా
అడుగడుగునా ప్రతి మలుపునా రోజూ నా వెంటే పడకు
విడవని పంతముగా నా ప్రాణం తినకు

నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా
నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా
అడుగడుగునా అడుగడుగునా పడిపోయినా పడిపోయినా
ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు అడుగడుగునా

హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా

హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా
తియ్యగా కొమ్మ ఒళ్ళో పున్నాగ పువ్వల్లె నవ్వమ్మా
||హాయిగా||

హరివిల్లుగ నవ్వుతు ఉంటే ఎండల్లో వెన్నెల కాయదా
చిరు జల్లుగ నవ్వుతు ఉంటే కొండైనా వాగల్లె పొంగదా
నునుమెత్తగ నవ్వుతు ఉంటే ముల్లైన పువ్వల్లె తాకదా
తొలిపొద్దుగ నవ్వుతు ఉంటే రాయైనా రత్నంగా మారదా
||హాయిగా||

అగ్గిలా మండిపడే నీ పంతమంతా
తగ్గితే చాలుకదా నీ జంట ఉంటా
అడుగే వేయనుగా నువ్వాగమంటే
అల్లరే ఆపు నువ్వే చెలరేగుతుంటే
బుద్ధిగా ఉంటాను అంటే నువ్వు నా బంగారు కొండ
ముద్దుగా నా మాట వింటే నువ్వు నా ముత్యాల దండ
రాముణ్ణై మంచి బాలుణ్ణై నే ఉంటా చక్కా
ఎవ్వరూ నిన్ను యముడే అనుకోరే ఇంక
||హరివిల్లుగ||


హద్దులే ఎరగనిది ఈనాటి స్నేహం
వద్దకే చేరదుగా ఏ చిన్న దూరం
ఎప్పుడూ వాడనిది ఈ పూల గంధం
జన్మలో వీడనిది ఈ రాగబంధం
గూటిలో గువ్వలు సాక్షి గుడిలో దివ్వెలు సాక్షి
చెప్పుకున్న ఊసులే సాక్షి చేసుకున్న బాసలే సాక్షి
దైవమా కాపు కాయుమా ఈ పసి జంటకి
కాలమా నువు రాకుమా ఈ పొదరింటికి
||హరివిల్లుగ||

చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే

చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే
రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి ||చిన్ననాటి||

సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి
దాడిలో వాడికి ఎప్పుడూ ఆ ధాటి కనలేదని
చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి
చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని
చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి
సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి
మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా
రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకెనే ||చిన్ననాటి||

తరలి రావా ఆ తారలూ రేయి నడిజాములో
వాలుజడసీమలో జాజులై తల దాచుకుంటామని
మురిసిపోవా రాదారులు వాయువేగాలతో
వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే విని
మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా
మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా
కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకనే చూపగా
ఝుమ్మ్నే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ ||చిన్ననాటి||

వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే సుడిగాలే

వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే సుడిగాలే నా ఈ మైనా
నారే నారే నారే ఇది త త తల్వారే యెద తీరేనా ఈ సోనా
పదహరు ఊపులో జానే జామది పిండేసింది క్యానషా
ఇక రౌండుదాకు నిద్దరపోకు ఖానా పీనా ఇక బంద్‌
రామ్మ రామ్మ రామ్మ హే రామా ఇక ప్రేమ పాలే కొయ్య
రామావ ||వారే||

తేనెటీగ తరంగంనే వేసి సోయగాలు తొడిగేసి
సుకుమారి పోవె అని బ్రహ్మే పంపాడే
పూత రేకుకు ఒక నడుమే ఇచ్చి ఊరిమీదకి ఎరవేసి
దీన్ని కన్న వాళ్ళే మరి మాపై కొదిలారా
మిల మిల లాడే మేఘమాల అలజడి రేపి పోయెరో
గల గల లాడే గుండెలోనా కలవరమాయె చూడరో
ఇది హయి అనుకోనా మాయ అనుకోనా మస్తుగుంది ప్రియతం
రామ్మ రామ్మ రామ్మ హేరామా ఇక ప్రేమ పాలే కొయ్య రామావ ||వారే||

చూడు చూడు మరి నాలో నేనే మాటలాడుకొను వింత
ఇది పిచ్చికాదు చెలి ఆడు దోబూచి
మారిపోయె ఇక లోకం మొత్తం చేరిపోయె చెలి సొంతం
ఇక ఎంత హయి మదిలోనా ఓ సోసి
మెరుపుల తీగో కందిరిగో అరె అరె ధేఖో సుందరి
పరువపు వాగో తామరాకో ననువలచిందో ఒంటరి
ఇది యవ్వన వీణ తుంటరి వాన మాయదారి చిత్తు
రామ్మ రామ్మ రామ్మ హేరామా ఇక ప్రేమ పాలే కొయ్య రామావ

చెప్పాలనుంది చిన్న మాటయిన ఆగనందీ

చెప్పాలనుంది చిన్న మాటయిన ఆగనందీ, దాగనందీ
లోలోన, ఇన్నాళ్ళ నుండీ ఉన్న మాటయిన ఇప్పుడేగా చెప్పమందీ ప్రేమయిన
పెదవే కదిలించకు, మనస్సే వినిపించకు, పరదా
తొలగించు కొంతైనా, సరిలే అనిపించకు, త్వరగా
చెయ్యి అందుకో నీ కోసం వేచి చూస్తున్నా చెప్పాలనుందీ

గుండెలయలో దీంత దిరనా ఎన్ని కధలో ప్రేమ వలనా
హాయి అలలో ఓ ఊయిలవన రేయినదిలో జాబిలవన
నీ ప్రేమలోనె మేలుకుంటున్నా మేఘాలపైనే తేలిపోతున్నా
నాకు తెలియని నన్ను కలగని నవ్వుకుంటున్నా చెప్పాలనుందీ

వెంటనడిచే నీడననుకొ జంట నడిపె జాడననుకో పూలు
పరిచే ఓ దారి ననుకొ నిన్ను కలిసె బంధమనుకొ
నా ప్రేమలోకం నువ్వే అంటున్నా నీతో ప్రయాణం
ఇష్టమేనన్న ప్రేమ తెలిపిన రామచిలుకను హత్తుకోమన్నా చెప్పాలనుందీ

ఓమారే ఓమారే ఓమారే ఇక నీకు నాకు

ఓ మారే ఓమారే ఓమారే ఇక నీకు నాకు హద్దు పొద్దు నోమోరే
ఓ మారే ఓమారే ఓమారే నీతో ముద్దాటకి బుగ్గ సైడు తయారే
పిప్పిప్పి సన్నాయి పాడాలిలే పందిట్లో సందళ్ళే రేగాలిలే
డుం డుం డుం భాజాలే మోగాలిలే ఊరంతా హోరెత్తి పోవాలిలే
ఏ పిల్లా పిల్లా పిల్లా పిడుగై రానా
ఏ అలా గలా గలాటాగా హత్తుకుపోనా
ఏయ్‌ పులి పులి పులు వేటకు రాగా
అన్నీ గిల్లి సయ్యాటకి ఎత్తుకుపోరా ||ఓమారే||

కాస్కోరాణి కధే మొదలెట్టగా కందిపోతావా కంగారు కావా
ఖాజా రాజా తనే కబురెట్టాకా జారిపోతావా జమాయిస్తావా
కేరింతల్లో ఆరు నూరవుతావా
గోరింతల్లో గోటి గాటవుతావా
చూపుల్లో చలిమంట రేపెడతావా సిగ్గొంచి పిలిస్తే చీ కొడతావా
శ్రీరస్తు శుభమంటా ఊ కొడతావా వడి బియ్యం కట్టించే వరుడవుతావా
ఏ పిల్లా ఎత్తుకుపోరా ||ఓమారే||

కోరమీసం గుచ్చుకుంటే ఎట్టా లేత పరువాలు అమ్మో అనేలా
ఏదో మైకం తెచ్చుకోవే పిట్టా చురుకులో హయి ఆహ అనేలా
బెల్లో పేనై నన్ను గిలిపెడతావా
పశు పూర్తినై నన్ను పడగొడతావా
ముద్దార ముళ్ళేసి మురిపిస్తావా పొద్దుల్లో మెలేసే మొగుడవుతావా
ఏడేసి అడుగుల్లో నడిచొస్తావా ఏకాకి ఉపాసం చెడగొడతావా
ఏ పిల్లా ఎత్తుకుపోరా ||ఓమారే||

అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది

అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది
తెలియని హాయి ఇది అలజడి రేపుతున్నది
తనువంతా పులకిస్తున్నది, చిగురంతై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నదీ మనస్సు ఎందుకో మరీ
నీలాగే నాకూ ఉన్నదీ, ఏదేదో అయిపోతున్నదీ
నా ప్రాణం నువ్వంటున్నదీ, మనస్సే ఎందుకే ప్రియా మరీ
మరీ అరెరెరె ఏ మది పరిగెడుతుంది నా మది
లేతపెదవుల తీపి తడి మొదటి ముద్దుకు ఉలిక్కిపడి మేలుకున్నదీ
ఎడమవైపు గుండె సడి ఎదురుగా నీ పిలుపు విని వెల్లువైనది
తొలి వెన్నెలంటే తెలిపిందీ నీ జతలో చెలిమి
తొలి వేకువంటే తెలిసిందీ నీ చేయి తడిమి
కన్నులు చూసిన తొలి వరము కలలు కోరిన కల వరము నిన్న లేదే ఇది
చిలిపి సిగ్గులు పరిచయము కొంటె నవ్వుల పరిమళము నచ్చుతుంది
మన మధ్య వాలె చిరుగాలి నలిగిందే పాపం
పరువాల లాల చెలరేగి చిరిగిందే దూరం అరెరె

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే
అవకాశం అడిగెనురా అలుపే రాని కేరింతలు తను మురిసీ మన రాగాలలో
అనురాగాలలో తను కూడా మనలాగే మురిసీ ||గుళ్ళో దేవుడు||

ఇందరుండగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా
కాంతులుండగా ప్రతి వారి కంటిలో ఆ రంగుదాటి కంటినీరు పొంగిరాదుగా
చొరవలు లేని సంతోషం అలకలు ఉన్నా అరనిమిషం ఎన్నెన్నొ ఉన్నాయి
లేని దొకటే కల్మషం ||గుళ్ళో దేవుడు||


అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి అన్న
గోపురం వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి
మనసే ఏ తిధులు లోకాలే అతిధులు ||గుళ్ళో దేవుడు||

సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ

సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవేమే పిసినారి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు బ్రహ్మచారీ బ్రహ్మచారీ నడవొద్దు నువ్వే అడ్డదారి
మనసిచ్చావే ముద్దుగా మాటిచ్చావే ముద్దుగా
మనసిచ్చాగా ముద్దుగా మాటిచ్చాగా ముద్దుగా
అవసరమొచ్చి ముద్దిమ్మంటే హరి హరి హరి హరి నువ్వు చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి ||సుక్కు సుక్కు||

ఆడా ఇడా ఇమ్మంటే నీడ మిద ముద్దిస్తావు ఆటాడేద్దాం రమ్మంటే
నై నై నై నై నై నై పోను పోను పోనంటే ఫోనులేనే ముద్దిస్తాను పై పై
కెళదాం పదమంటే
నై నై నై నై నై నై అబ్టా అబ్టా చేస్తుంటే తలనొప్పిగుందని అంటావు
మంటై వెంటై పడుతుంటే ఇది మంచి రాస కాదంటాను
ఆడాళ్ళంతా ఎప్పుడూ ఇంతే హరి హరి హరి హరి నువ్వు చాలా చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి ||సుక్కు సుక్కు||

చేతికి ముద్దే పెట్టేస్తే చెంప మీద ఇమ్మంటావు చెంపకి ముద్దే రుద్దేస్తే
తకతై తై తకతై తై
నోటికి ముద్దే అందిస్తే గీత దాటి రమ్మంటావు గీతే దాటి నువ్వొస్తే
తకతై తై తకతై తై
సిగ్గు బిడియం ఇవ్వడమూ నోకు దాగి మరి నవ్వడమూ మరి మగవాళ్ళంతా
ఎప్పుడూ ఇంతే

చక్కెరకేళి పండు చక్కెరకేళి పండు నా తోడు నీడై నువ్వుండు

చక్కెరకేళి పండు చక్కెరకేళి పండు నా తోడు నీడై నువ్వుండు
పిప్పరమెంటు పిల్లా పిప్పరమెంటు పిల్లా నాఈడు జోడై నువ్వుండు
తోలిప్రేమ నేడు నీ పేరు రాదా పిలిచింది చూడు నిజంగా నిజంగా
మనసైన వాడు చెయ్యందుకోగా ముందే ఉన్నాడు నిజంగా నిజంగా
ఆ మాటే మళ్ళీ అను ||చక్కెర కేళి||

నేనంటే నువ్వంటూ చేతల్లో చూపెట్టు నా మనసు నమ్మేట్టుగా
నాలోనే నువ్వుంటూ నేనన్ను దీవింతు సందేహమా వింతగా
వద్దనుకున్నా నేను ఊపిరిలా ఉంటాను
ఇద్దరమంటూ లేనేలేమని నేనంటున్నాను

రాకాసి చూపుల్తో నాకేసి చూస్తావేం నేనరిగిపోనా మరీ
మారాణి నువ్వుల్తో ప్రాణాలు లాగేసి గారాలు పోకే మరీ
సర్లే కానీ బాబూ ఈ సారికి ఇలా కానివ్వు
ఇప్పుడు ఎప్పుడు తప్పని సరిగా చేస్తాలే తప్పు ||చక్కెర కేళి||

20 April 2010

నవ్వులు రువ్వే పువ్వమ్మా

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళూ నీలా
ఉండి పోతే చాలమ్మా |నవ్వులు రువ్వే|

ఆకుల పయ్యెద లో
నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కెంపులలో
నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన
మొగ్గ సొగసే ఉందమ్మా |నవ్వులు రువ్వే|

ఈ తోట మొత్తము కమ్మినవి
నీ దోర వయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవి
నీ కన్నె మనసులో కైపులు
నువ్వొలకబోసే ఒంపుసొంపులకు
ఒడిని పడతానుండమ్మా |నవ్వులు రువ్వే|

ఏ కొమ్మకు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసేవో
ఏ తేటికి విందులు చేసేవో
ఆ పాట గానో తేటి గానో
పది నాళ్ళున్నా చాలమ్మా |నవ్వులు రువ్వే|

సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం

తికమకపెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం
అలాగ వుంటాం ఇలాగవుంటాం ఆకతాయిలం మేము
చెప్పేదేదో అర్థమయ్యేట్టు చెప్పరా అరేభాయ్‌ ఇస్ట్రెటుగానే చెప్తా ఇనుకో
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజూ తన్నుకు చస్తాం ||సత్యం||

నమ్మితె ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం
అరె ముక్కుసూటిగా వున్నది చెప్తాం నచ్చకుంటే మీ ఖర్మం
అరె కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా
చెదరని నవ్వుల ఇంద్రధనుసులం
మేమే ఇండియన్స్‌ మేమే ఇండియన్స్‌
మేమే ఇండియన్స్‌ అరె మేమే ఇండియన్స్‌

వందనోటు జేబులో వుంటే నవాబు నైజం
పర్సు ఖాళీ అయ్యిందంటే పకీరు తత్వం
కళ్ళులేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం
పడుచు పోరి ఎదురగ వస్తే పళ్లికిలిస్తాం
ప్రేమా కావాలంటాం పైసా కావాలంటాం
ఏవో కలలే కంటాం తిక్కతిక్కగా వుంటాం
ఏడేళ్ళయినా టివిసీరియల్‌ ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్‌ చేస్తాం
కోర్టు తీర్పుతో మనకేం పనిరా సచ్చినోడికోటేస్తాం
అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పజెప్పిస్తాం
రూలు వుంది రాంగూ వుంది
రూలు తప్పుకు తిరిగే లౌక్యం వుంది ||మేమే||

వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో
శత్రువుకే ఎదురు నిల్చినా రక్తం మనదీ
ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది
ఈశ్వర్‌ అల్లా ఏసు ఒకడే కదరా బాసు
దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా
మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు
అన్నదమ్ములకు చిచ్చుపెట్టిన లుచ్ఛగాళ్ళ పనిపట్టు
భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయి ఒట్టు
కుట్రలు చేసే శత్రుమూకల తోలు తీసి ఆరబెట్టు
దమ్మేవుంది ఆఆధైర్యం వుంది
ఆ తలవంచని తెగ పొగరేవుంది ||మేమే||

ఒక బృందావనం సోయగం

ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

నే సందెవేళ జాబిలి నా గీత మాల ఆమని
నా పలుకు తేనె కవితలే నా పిలుపు చిలక పలుకులే
నే కన్న కలల నీడ నందనం
నాలోని వయసు ముగ్ధ మోహనం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

నే మనసు పాడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే
ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చెయనే
నే సాగు బాట జాజి పూవులే
నాకింక సాటి పోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ

ఒక బృందావనం సోయగం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది

పున్నమి వెన్నెలలోన పొంగులు కడలి
నిన్నే చూసిన వేళ విందులు చెలిమి
ఒహొహొహొ నువ్వు కడలివయితే నే నదిగమారి
చిందులు వేసి వేసి నిన్ను చేరనా
చేరనా చేరనా
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది

విరిసిన కుసుమము నీవై మురిపించేవు
జాబిలి నేనై నిన్ను పెనవేసేను
ఓహొహొ మేఘము నీవై నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా ఆడనా ఆడనా
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది

కోటి జన్మలకయినా కోరెదొకటే
నాలో సగమై ఎప్పుడు,నేనుండాలి
ఒహొహొహొ నీవున్న వేళ ఆ స్వర్గమేల
ఈ పొందు ఎల్లవేళలందు ఉండని
ఉండని ఉండని
ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి ఎన్నటికి మాయని మమత నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
అహాహ హహ ఒహో హొహొహొ

పూజలు చేయ పూలు తెచ్చాను

పూజలు చేయ పూలు తెచ్చాను
పూజలు చేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను
తీయరా తలుపులనూ రామా
ఈయరా దర్శనము రామా
పూజలు చేయ పూలు తెచ్చాను

తూరుపులోన తెలతెలవారే
బంగరు వెలుగు నింగిని చేరే
తొలికిరణాలా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
తొలికిరణాల హారతి వెలిగే
ఇంకా జాగేల స్వామీ
ఈయరా దర్శనమూ రామా
పూజలు చేయ పూలు తెచ్చాను

దీవించేవో కోపించేవో
చెంతకు చేర్చీ లాలించేవో
నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి
నిన్నే నమ్మితిరా స్వామీ
ఈయరా దర్శనము రామా

పూజలు చేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను
ఈయరా దర్శనము రామా
పూజలు చేయ పూలు తెచ్చాను

సీతే రాముడి కట్నం

సీతే రాముడి కట్నం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
రామయ్యే సీతమ్మకు పేరంటం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే
పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం

సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది
ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతమ్మ రామయ్యల కళ్యాణం


సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం

బులి బులి ఎర్రని బుగ్గలదాన

బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ మరచి పోయవా నువ్వే మారి పోయవా

చెడ్డ దారిలో తిరిగానే
నీ చెంప దెబ్బలే తిన్నానే
చెడ్డ దారిలో తిరిగానే
నీ చెంప దెబ్బలే తిన్నానే
మంచి మాట నీ నోట వినాలని
ఓహొ రాధా ఓక మంచి మాట
ఒక మంచి మాట నీ నోట వినాలని
మనసు మార్చుకుని వచ్చానే వచ్చావె

బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ మరచి పోయవా నువ్వే మారిపొయవా

బొమ్మల పెళ్ళి చెసావే
ఈ బొమ్మకు హారం వేసావే
చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
ఆయ్యొ రాధా నేచచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
నన్నె కాదని అంటావే అంటావే

బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ మరచి పోయవా నువ్వే మారిపొయవా

ఎవడొ రాజా అంటవే ఈ రాజానే కాదంటావే
ఎవడొ రాజా అంటవే ఈ రాజానే కాదంటావే
కళ్ళు తెరుచుకో కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో
కావాలంటే పరీక్ష చేసుకో చూసుకో

బులి బులి ఎర్రని బుగ్గలదానా
చెంపకు చారెడు కన్నుల దానా
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ మరచి పోయవా నువ్వే మారిపొయవా

సిగ్గేస్తదోయ్‌ బావ సిగ్గేస్తదీ

సిగ్గేస్తదోయ్‌ బావ సిగ్గేస్తదీ
మొగ్గలేను ఒగ్గలేను
మొగమెత్తి చూడలేను ||సిగ్గే||

పచ్చికా బయలులోన
మచ్చికగా మనముంటే
సిగ్గులేని చందమామ
చాటుగుండి చూస్తాడు ||సిగ్గే||

రెప్పలార్పకుండా ని
న్నెప్పుడైన చూస్తినా
టక్కులాడి చుక్కలన్ని
ఫక్కుమని నవ్వుతాయి ||సిగ్గే||

గుట్టుగా చెట్టుక్రింద
గుస గుసలు చెప్పుకుంటే
చెట్టుమీది పిట్టలన్ని
చెవులు నిక్కబెడ్తాయి ||సిగ్గే||

ఎందుకో అందరికి
ఇంత ఈసు మనమంటే
ఎవ్వరూ చూడలేని
ఏడకైన ఎల్దాము ||సిగ్గే||

రాక రాక వచ్చావు చందమామ

రాక రాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువభామ
మబ్బులన్ని పోయినవి మధుమాసం వచ్చినది
మరులుకొన్న విరికన్నె విరియబూసి మురిసింది
లేక లేక నవ్వింది కలువభామ ||రాక||

రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది
ఆకసాన నినుజూచి ఆనందం పొంగినది
లేక లేక నవ్వింది కలువభామ ||రాక||

తీరని కోరికలే తీయని తేనియలై
వెన్నెల కన్నులలో వెల్లివిరిసి మెరిసినవి
దొంగలాగ దూరాన తొంగి చూతువేల
రావోయి రాగమంత నీదోయి, ఈ రేయి
రాకరాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువభామ||

ఎక్కడమ్మా చంద్రుడూ? చుక్కలారా, అక్కలారా

ఎక్కడమ్మా చంద్రుడూ? చుక్కలారా, అక్కలారా
నిక్కి నిక్కి చూతురేల ఎక్కడమ్మా చంద్రుడూ?
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
మబ్బు వెనుక దాగినాడో మనసులేక ఆగినాడో ||ఎక్క||

పెరుగునాడు తరుగునాడు ప్రేమ మారనిసామి, నేడు
పదము పాడి బ్రతిమలాడి
పలుకరించిన పలుకడేమి! ||ఎక్క||

చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
ఏలనో కానరాదు ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా చంద్రుడూ!

పెళ్లి ముహూర్తం కుదిరిందా

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా ||

భలే మొగుణ్ణి పట్టావు
ముసళ్ళ పండగ ముందేలే
అసలు వడ్డీ యివ్వాల్లే
పిల్లా నీ పొగరణిగిందా|| ||పెళ్లి||

మహరాజింటి మనువంటె
మజాక అనుకున్నావంటే!

బంగరు నగలు రంగులరాళ్ళు
బారీ కోకలు పట్టు రైకలు
గంగిరెద్దులా సింగారించి
గాడిద బరువులు మోయాలోయ్‌
పిల్లా నీ పొగరణిగిందా
పొగరణిగిందా || ||పెళ్లి||

పెత్తన మొస్తుందనుకోకు
నెత్తికి కళ్ళు రానీకు
అతాత మామా ఉన్నారూ, నీ
సత్తా ఏమో చూస్తారు
పిల్లా నీ పొగరణిగిందా
పరదా లోపల మురగాలి తిరిగే కాలు నిలవాలి
పలుకూ తీరూ మారాలి, నీ
తలబిరుసంతా తగ్గాలి పిల్లా నీ పొగరణిగిందా?||పెళ్లి||

రాధను రమ్మన్నాడు

రాధను రమ్మన్నాడు
రాస్రకీడకు మధవదేవుడు
రాధను రమ్మన్నాడు
నల్లనివాడు, అల్లరివాడు
నమ్మినవారికి చల్లనివాడు
ముల్లోకాలను పిల్లనగ్రోవితో
మురిపించే మోహనకృష్ణుడు ||రాధను||

గోపాలుడు, మా పాలిటి దేవుడు
రేపల్లెకు తానెపుడూ పాపడు
చల్లను తెచ్చే గొల్లపిల్లతో
సరసాలాడుచు ఉన్నాడు ||రాధను||

యమునాతటిలో ఉన్నాడు
ఇది అనువౌ సమయం అన్నాడు
యశోదమ్మకి విషయాలేవీ
తెలుపవద్దనే బ్రతిమాలాడూ ||రాధను||

వద్దురా కన్నయ్య ఈ పొద్దు

వద్దురా కన్నయ్య ఈ పొద్దు
ఇల్లువదలి పోవద్దురా అయ్య
పశువులింటికి తిరిగి పరుగులెత్తేవేళ
పసిపాలను బూచి పట్టుకెళ్ళే వేళ ||వద్దు||

పట్టు పీతాంబరము మట్టిపడి మాసేను
పాలుగారె మోము గాలికే వాడేను ||వద్దు||

గొల్లపిల్లలు చాల అల్లరి వారురా
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు ||వద్దు||

ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న
ఆదట నీకున్న అన్నిటను నీదాన ||వద్దు||

ఏడవనీ ఏడ్చేవాళ్లను ఏడవనీ

ఏడవనీ ఏడ్చేవాళ్లను ఏడవనీ
ఎదుటివాళ్ళు బాగున్నారని ఏడవనీ
నవ్వేవాళ్ళ అదృష్టమేమని ||ఏడ్చే||

నవ్వండి నవ్వేవాళ్ళతో నవ్వండి
నాలుగు ఘడియల నర జీవితము
నవ్వుల తోటగ చేయండి
అది నవ్వుల తోటగ చేయండి ||ఏడ్చే||

వచ్చినవాళ్ళు పోతారు పోయిన వాళ్ళు రాబోరు
ఈ రాక పోకల సందున ఉంది రంజైన ఒక నాటకము
కదిలిస్తే అది బూటకము అది అంతా ఎందుకు గానీ
అనుభవించి పోనీ జీవిని అనుభవించి పోనీ ||ఏడ్చే||

ఉండేది ఎంతకాలమో ఊడిపోతాము ఏ క్షణమో
రేపన్నది రూపే లేనిది ఈ దినమే నీ కున్నది
అందాన్ని ఆనందాన్ని అనుభవించి పోనీ జీవిని
అనుభవించి పోనీ ||ఏడ్చే||

ఏడ్చెవాళ్లని ఏడవనీ కళ్ళు కుట్టి ఏడవనీ
కడుపుమండి ఏడవనీ కుళ్ళి కుళ్ళి ఏడవనీ
ఏడవనీ ఏడవనీ ఏడవనీ

ఇంటికి దీపం ఇల్లాలే

ఇంటికి దీపం ఇల్లాలే
సుఖాలపంటకు జీవం ఇల్లాలే
కళకళలాడుచు - కిలకిల నవ్వుచు
బ్రతుకే స్వర్గము అనిపించునుగా
పతికే సర్వము అర్పించునుగా ||ఇంటికి||

నాధుని తలలో నాలుక తీరున
మంచి చెడులలో మంత్రి అనిపించును
అభిరుచి తెలిసి - ఆకలి నెరిగి
అన్నము పెట్టే అమ్మను మించును ||ఇంటికి||

సహచర్యములో, పరిచర్యలలో
దాసిగా తరింప జూచుచు
దయావాహిని - త్యాగరూపిణి
భారత మానిని - భాగ్యదాయిని ||ఇంటికి||

వలపులోని చిలిపితనం ఇదేలే

వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టిచిక్కు అదేలే ||వలపు||

కన్నులకీ అల్లరి నేర్పిన దెవ్వరు
మనసులోని జొరబడిన మగసిరికల ధీరుడు
అంత ధీరుడీనాడు ఏమైనాడు
అంత ధీరుడీనాడు ఏమైనాడు
నీ యింత గుండెలోన ఇమిడిపోయినాడు
నీ యింత గుండెలోన ఇమిడిపోయినాడు
||వలపు||

తెలిసీ తెలియని మనసు తెరిచినది ఎవ్వరూ
లోనికి రాగానే మూసినది ఎవ్వరూ
తీయని కలలను తినిపించిన దెవ్వరూ
తీయని కలలను తినిపించిన దెవ్వరూ
తినిపించి చిటికెలోన ఓడించినది ఎవ్వరూ ||వలపు||

చలివేసే వేళలో వైడైన దెవ్వరు
వేడైన విరహంలో తోడైన దెవ్వరు
నాలోన ఉండి నాకు నీడైన దెవ్వరు
తోడు నీడగా వుండి దోచిన దెవ్వరు ||వలపు||

మళ్ళున్నా మాన్యాలున్నా మంచెమీద మగువుండాలి

మళ్ళున్నా మాన్యాలున్నా
మంచెమీద మగువుండాలి
పాడివున్నా పంటలు వున్నా
పంచుకునె మనసుండాలి ||మళ్ళున్నా||

పైరు మీది చల్లని గాలీ
పైట చెరగు నెగరేయాలీ
పైట చెరగు నెగరేయాలీ
పక్కన వున్న పడుచువానికి
పరువం ఉరకలు వేయాలి
పరువం ఉరకలు వేయాలి ||మళ్ళున్నా||

కాలు దువ్వి కోవెల బసవడు
ఖంగుమనీ రంకెయ్యాలీ
జడవనులే మా వారున్నారు
వారి ఎదలో నేనుంటాను ||మళ్ళున్నా||

ఏతమెక్కి గెడ వేస్తుంటే
ఎవరీ మొనగా డనుకోవాలీ
వంగి బానను చేదుతు వుంటే
వంపుసొంపులు చూడాలి ||మళ్ళున్నా||

అమ్మ ఒడి పూవువలె మెత్తనమ్మా

అమ్మ ఒడి పూవువలె మెత్తనమ్మా
ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా
ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా
ఆడుకుని ఆడుకుని అలసిపోతివా
ఆడుకుని ఆడుకుని అలసిపోతివా
అలుపుతీర బజ్జో మా అందాల బొమ్మా

||అమ్మ||

అమ్మాయి కన్నులు తమ్మి పువ్వుల్లు
అమ్మాయి కన్నులు తమ్మి పువ్వుల్లు
తమ్మి పువ్వులు పూయు తనిరు వెన్నెల్లు
తమ్మి పువ్వులు పూయు తనిరు వెన్నెల్లు
ఆ వెన్నెలను మూసేను కన్నీటి జల్లు
ఆ వెన్నెలను మూసేను కన్నీటి జల్లు
కన్నీరు రానీకు కరుగు నెలగండ్లు ||అమ్మ||

కనిపించు దేవుళ్ళు కమ్మని పాపల్లు
కనిపించు దేవుళ్ళు కమ్మని పాపల్లు
కనిపించె తల్లికి కన్నుల జోతుల్లు
కనిపించె తల్లికి కన్నుల జోతుల్లు
వేయాలి పాపాయి తప్పటడుగుల్లు
వేయాలి పాపాయి తప్పటడుగుల్లు
చేయాలి ఆపైన గొప్ప చేతలు ||అమ్మ||

అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా

అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా
ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా
ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా
ఆడుకుని ఆడుకుని అలసిపోతివా
ఆడుకుని ఆడుకుని అలసిపోతివా
అలుపుతీర బజ్జోమా అందాలబొమ్మా ||అత్త||

అమ్మలు కన్నులు తమ్మి పూవ్వుల్లు
అమ్మలు కన్నులు తమ్మి పూవ్వుల్లు
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు
ఆ వెన్నెలను మూసేసే కన్నీటి జల్లు
ఆ వెన్నెలను మూసేసే కన్నీటి జల్లు
కన్నీరు రానీకు కరుగు నెడదల్లు ||అత్త||

కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లు
కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లు
కనిపించె తల్లికి కన్నుల జ్యోతుల్లు
కనిపించె తల్లికి కన్నుల జ్యోతుల్లు
వేయాలి పాపాయి తప్పటడుగుల్లు
వేయాలి పాపాయి తప్పటడుగుల్లు
చేయాలి ఆపైన గొప్పచేతలు ||అత్త||

||అత్త||

ఎన్నో రాత్రులు వస్తాయికాని యిదియే తొలిరేయి

ఎన్నో రాత్రులు వస్తాయి
కాని యిదియే తొలిరేయి
ఎన్నో బంధాలున్నాయి
కానీ యిది శాశ్వతమోయి

పక్కన అతడు నిలబడితే
పరువం ఉరకలు వేస్తుంది
వయసుకు తగ్గది ఆ మొగ్గు
వల్లమాలినది ఈ సిగ్గు

వస్తాడమ్మా నీరేడు
ఏమిస్తాడో రుచి చూడు
మల్లెల మంచం పిలిచింది
ఉయ్యల త్వరలో రానుంది


ఎవరో చెబితే విన్నాను
విన్నది నీతో అన్నాను
నాకూ యింతే తెలిసినది
నీకే తెలియును మిగిలినది

18 April 2010

మావి చిగురు తినగానే కోయిల పలికేనా

మావి చిగురు తినగానే కోయిల పలికేనా
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఎమో ఎమనునో గాని ఆమని ఈవని
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిల పలికేనా

తిమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తిమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా
సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పొడుములు
ఎమొ ఎవ్వరిదోగాని ఈవిరి గడసరి

మావి చిగురు తినగానే కోయిల పలికేనా ఆ ఆ
కోయిల పలికేనా

ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల జంపాల
జంపాల ఉయ్యాల
ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో పులకరింతలో
పలకరింతలో పులకరింతలో
ఎమో ఎమగునోగాని ఈ కధ మన కధ

మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఎమో ఎమనునో గాని ఆమని ఈవని
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిల పలికేనా

సీతాలు సింగారం మాలచ్చి బంగారం

సీతాలు సింగారం మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం
మనసున్న మందారం మనిషంత బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
మనసున్న మందారం మనిషంత బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
సీతాలు సింగారం

కూసంత నవ్విందంటే పున్నమి కావాల
ఐతే నవ్వనులే ఏ ఏ
కాసంత చూసిందంటే కడలే పొంగాల
ఇక చూడనులే ఏ ఏ
కూసంత నవ్విందంటే పున్నమి కావాల
కాసంత చూసిందంటే కడలే పొంగాల
ఎండితెరమీద పుత్తడిబొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగుబొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల
నువ్వంటుంటే నేవింటుంటే నూరేళ్ళు నిండాల ఆ


సీతాలు సింగారం మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
మనసున్న మందారం

దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను
ఐతే నేనే వస్తాలే ఏ ఏ
చక్కలగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
ఎగిరొస్తాలే ఏ ఏ
దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి వెలిగించాల
నీ వెలుగుకు నీడై బ్రతుకుకి తోడై వుండిపోవాల
నువ్వంటుంటే నేవింటుంటే నూరేళ్ళు బతకాల ఆ

సీతాలు సింగారం మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
లాలల లాలల లాలల లాలల

16 April 2010

మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్

మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్
రమ్య కృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయి రోయ్
ఎవ్వరు రా ఆ చిన్నది.. ఎక్కడ రా దాగున్నది..
ఎప్పుడు రా.. ఎటు నుంచి దిగుతుంది

dream girl యదలో ఈల వేసే nightingale
dream girl మెడలో మాల వేసే darling doll

లా..లా..లా..ల..ల..ఆహా..ఆహ.హా.హ.హా..
hello honey welcome అని అంటూ నీ వెంట ఉన్నానని
కల్లోన నువు లేవని గిల్లేసి చూపించని
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలని
నమ్మలి నా మాటని తగ్గించు అల్లర్లని

dream girl గుండెల్లో మోగే Temple bell
dream girl దిగి రా నీలి నింగి twinkle star


ఆటడినా మాటాడినా ఆలోచనంత తానేనని
చెప్పేది ఎల్లాగని చేరేది యే దారిని
యెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడుగడుగుని
చూస్తున్న ఆ కళ్ళని చూసేది యే నాడనీ

dream girl
కొంగు చాటు గులాబి ముళ్ళు నాటు honeybee ఎక్కడుందొ ఆ baby
కొంటె ఊసులడింది heartbeat పెంచింది ఎమిటంట దాని hobby

What is this
వంకయ్ పుల్స్
no address
miss universe
mental case
అంతెలేర బాసు
may God Bless u

dream girl యదలో ఈల వేసే nightingale
dream girl దిగి రా నీలి నింగి twinkle star

dream girl నిన్నే తలచుకొంటే నిద్దర nill
dream girl మనసే తడిసిపొయే waterfall
dream girl త్వరగా చేరుకోవే my darling
dream girl ఇంకా ఎంతకాలం ఈ waiting
hey my dream girl