01 October 2007

సంతోషం సగం బలం

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ
ఆ సంగీతం నీతోడై సాగవె గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవ చెయ్యకు
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకద
ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయద
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ
నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ
లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

1 comment:

Viswanadham said...

Feel good movie and very very meaningful song
Thank you soooooo much