06 October 2007

గోరంక గూటికే చేరావు చిలకా

గోరంక గూటికే చేరావు చిలకా
గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక

ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
ఆదమరచి ఈ రేయి హాయిగా నిదురపో

గోరంక

నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బంగారు చిలకా
గోరంక

No comments: