06 October 2007

ఎంత హాయి యీ రేయి

ఎంత హాయి...
ఎంత హాయి యీ రేయి, ఎంత మధురమీ హాయి
ఆ...
ఎంత హాయి యీ రేయి, ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా...
చందమామ చల్లగా పన్నీటిజల్లు చల్లగా
ఎంత హాయి... ఎంత హాయి

ఎంత హాయి...

ఆ... ఆ...
ఒకరి చూపులొకరి పైన విరితూపులు విసరగా
ఆ...
ఒకరి చూపులొకరి పైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా
ఎంత హాయి... ఎంత హాయి

ఎంత హాయి...

ఆ... ఆ...
కానరాని కోయిలలు మనకు జోలపాడగా
కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
మధురభావలాహిరిలో మనము తూలిపోవగా
మధురభావలహరిలో మనము తేలిపోవగా
ఎంత హాయి... ఎంత హాయి

ఎంత హాయి... ఈ రేయి...

No comments: