12 February 2010

రాయిని ఆడది చెసిన రాముడివా..

రాయిని ఆడది చెసిన రాముడివా..
గంగను తలపై మోసె శివుడివా..
రాయిని ఆడది చెసిన రాముడివా
గంగను తలపై మోసె శివుడివా
ఎమనుకోను నిన్నేమనుకోను ఎమనుకోను నిన్నేమనుకోను

నువ్వు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానె కాను
నువ్వు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానె కాను
తోడనుకో నీ వాడనుకో
తోడనుకో నీ వాడనుకో


నేనేంటి నా కింతటి విలువేంటి నీ అంతటి మనిషి తోటి పెళ్ళేంటి
నీకేంటి నువ్వు చెసిన తప్పేంటి ముల్లు నొదిలి అరితాకుకు శిక్షేంటి
తప్పు నాది కాదంటె లొకమొప్పుతుందా
నిప్పులాంటి సితనైన తప్పు చెప్ప కుందా
తప్పు నాది కాదంటె లొకమొప్పుతుందా
నిప్పులాంటి సితనైన తప్పు చెప్ప కుందా
అది కధే కదా
మన కధ నిజం కాదా
అది కధే కదా
మన కధ నిజం కాదా

||రాయిని||

ఈ ఇల్లూ తోడొచ్చిన నీ కాళ్ళు.. నా కెన్నెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వెల్లు కన్నీళ్ళతొ వెలిగించే హృదయాలు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
అది నువ్వే కదా నేను నువ్వే కాదా
అది నువ్వే కదా నేను నువ్వే కాదా
నువ్వు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానె కాను
ఎమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీ వాడనుకో

||రాయిని||

No comments: