10 May 2010

ఈ పాదం ఇలలొనె నాట్య వేదం

ఈ పాదం ఇలలొనె నాట్య వేదం...
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం || ఈ

1. ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆ నాటి బలికి అంతం
తనలోని గంగమ్మ ఉప్పొంగగా
ఇలలోనీ ఆ గౌతమే పొంగగా
పాట పాటలో తను చరణ మైన వేళ
కావ్య గీతిలో తను పాదమైన వేళ
గానమె తన ప్రాణమై..లయలు హొయలు విరిసె

2.. ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే ఈ భద్ర కమల మధుపమ్
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య సీత్రాల శ్రీగంధమై
ఈ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఈ పాదమే వరదయ్య నాట్య పదమై
తుంబుర వద నారద మునులూ జనులూ కొలిచే ఈ పాదం

No comments: