12 May 2010

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

సాకీ:
రాయి... ఏం రాయాలి... లెటర్
ఎవరికీ... నీకు... నాకా... ఉం
నాకు రాయటం రాదు... ఈ మద్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా...
వెయిట్... నాకు నీవు వ్రాసే ఉత్తరం నేను వ్రాసి...
నాకు చదివినిపించి తరువాత నీవు చదువుకో
ఆ ఆ ఐ లైక్ ఇట్... ఉం చెప్పు...
ఉం... హ
నా ప్రియ ప్రేమతో నీకు (నీకు)
నే (వ్రాసే) నేను వ్రాసే (ఉత్తరం) ఉత్తరం లెటర్ చ... లెటర్
కాదు... ఉత్తరమే అని రాయి... చదువు

కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ఆ... పాటలా మర్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తాను
మొదట నా ప్రియ అన్నాను కదా! అక్కడ ప్రియతమా అని మార్చు
ప్రియతమా నీవచట క్షేమమా నేను ఇక్కడ క్షేమం

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఆ హా ఓ హో... నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది
కాని అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే

ఊహలన్నీ పాటలే కనుల తోటలో... అదే
తొలి కలల కవితలే మాటమాటలో అదే...
ఆహా బ్రహ్మాండం కవితా కవితా... ఉం పాడు

పల్లవి:
కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా? నేనిచట కుశలమే
ఊహలన్నీ పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాటమాటలో...
ఓహో కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
లాలలా లా లాల లాలలా లాలలా లాలలా
ప్రియతమా నీవచట కుశలమా? నేనిచట కుశలమే
లాలలా లా లాల లాలలా లాలలా లాలలా

చరణం:
ఊం నాకు తగిన గాయమదే చల్లగా మానిపోతుంది
అదేమిటో నాకు తెలియదు ఏ మాయొతెలియదు నాకేమి కాదసలు
ఇది కూడా రాసుకో అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివేసుకోవాలి
ఇదిగో చూడు నాకు ఏ గాయమైనప్పటి ఒళ్ళు తట్టుకుంటుంది
నీ ఒళ్ళు తట్టుకుంటుందా తట్టుకోదు ఉమాదేవి దేవి ఉమాదేవి
అది కూడా రాయాలా??? అదీ ప్రేమ
నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియకిదవుతుంటే ఏడుపొస్తుంది
కాని నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాదపెడుతుందనుకున్నప్పుడు
వచ్చే కన్నీలు కూడా ఆగుతుంది

మనుషులు అర్ధం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు
అగ్ని లాగ స్వచ్ఛమైనది

గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నామేనికేమి కాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా
శుభ లాలి లాలి జో - లాలి లాలి జో
ఉమాదేవి లాలి లాలి జో - లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
నా హృదయమా...

No comments: