10 May 2010

ఉందిలే మంచికాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందనా

ఉందిలే మంచికాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందనా...

ఎందుకో - సందేహమెందుకో

రానున్న విందులో - నీవంతు అందుకో

ఆరోజూ అదిగో, కలదూ - నీ ఎదుట
నీవే రాజువట

ఏవిటేవిటేవిటి మంచికాలమంటున్నావు ఎలాగుంటుందో నిశితంగా చెప్పు
దేశ సంపద పెరిగే రోజు
మనిషి మనిషిగా బ్రతికే రోజు

గాంధి మహాత్ముడు కలగన్న రోజు

నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు

ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో

అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో...

భలే భలే బాగా చెప్పావు కాని అందుకు మనవేం చేయాలో అదికూడా నువ్వే చెప్పు

అందరికోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరు కలిసి

సహకారమే మన వైఖరి ఐతే

ఉపకారమే మన ఊపిరి ఐతే

పేదా గొప్ప భేదం పోయీ అందరూ నీది నాదని వాదం మాని వుందురు

ఆరోజెంతో దూరం లేదు......

తీయ్యగా బ్రతుకంత మారగా కష్టాలు తీరగా సుఖశాంతులూరగా

ఆకాశ వీధుల ఎదురే లేకుండా ఎగురును మన జెండా

ఉందిలే.......

No comments: