09 May 2010

డుమ్‌ డుమార్‌ డుమ్‌ డుమారే పిల్ల పెళ్ళి చాంగుభళారే

డుమ్‌ డుమార్‌ డుమ్‌ డుమారే పిల్ల పెళ్ళి చాంగుభళారే భళారే
జంజమారే జంజమారే శివుడు పెళ్ళి చాంగు భళారే భళారే
ఆళ్‌గర్‌ పిరుమూడ్లు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి
నీకంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని ఈ రాత్ర్రి
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగారికే బొట్టు పెట్టెయ్యరా
తందనాలా తారలతో బంజరు మాకు తప్పించారా
ఈ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా ||ఆల్‌గర్‌||

మధురా వురికే రా చిలకా రావేనులే
పెళ్ళి పందిళ్ళలో ముగ్గేసినా పన్నీటి ముత్యాలెన్నో
కనుచాపలకు నిదురంటూ రారాదని
కరగెంటానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్నో
భువిలో కోలాటం గుండెలో ఆరాటం
యెదలో మొదలాయే పోరాటమే

అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా తల్లి ఈ కాపురం
శ్రీ గోపురం తాకాలి నీలాకాశం
ఇలా పేగుముడి ప్రేమగుడి నా తల్లివే
నువ్వు నా అండగా నాకుండగా కంపించి పోదా కైలాసం
ఇప్పుడే శుభ లగ్నం ఇది నా సంకల్పం
విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా ||ఆళ్‌గర్‌||

No comments: