12 May 2010

జగమే మాయ.. బ్రతుకే మాయ

జగమే మాయ.. బ్రతుకే మాయ
వేదాలలో.. సారమింతేనయ

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ
ఈ వింతేనయా

||జగమే||

కలిమి లేములు కష్ట సుఖాలు ||2||
కావడి లో కుండలని భయమేలోయి ||2||
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతే నోయి ఈ వింతేనోయి
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతే నోయి ఈ వింతేనోయి

||జగమే||

ఆశా మోహముల దరి రానీకోయి ||2||
అన్యులకే నీ సుఖము అంకితమోయీ ||2||
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్

||జగమే||

No comments: