అలిగితివ సఖీ ప్రియ కలత మానవా (2)
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా ||అలిగి||
లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా (2)
ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా ||అలిగి||
నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని (2)
సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా ||అలిగి||
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా (2)
భరియింపగ నా తరమా కనికరింపవా ||అలిగి||
No comments:
Post a Comment