పల్లవి:
కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
వన్నె పెంచుకుంటా నాకున్నదిచ్చుకుంటా
నీ వన్నె పంచమంటూ నే విన్నవించుకుంటా
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
కాదన్నా ఆ బ్రహ్మ ఓ బొమ్మ
నిన్ను కట్టుకోక తప్పదందుకే
మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీ సిగ్గు అంచువెంట నా ముద్దులేసుకుంటా
కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
చరణం1:
చూడవయ్య చలాకి లేడినయ్య
చలేసి చేరువయ్యా చులాగ్గ చేదుకో
వేడుకియ్య కసింత వేడినియ్య
కసంత వాడనియ్య మరింత చేరుకో
సందుచేసుకో సరైన సందెపొద్దురంధిలో
చందమామ కందిపోవు సందడందుకో
అందగత్తెరో హుషారు తొందరందుకుందిరో
చెందనాల చందనాల తొందరేందిరో
చిందాడు మైకంలో కథ ఎందాక పోతుందో
మందార సోకుల్లో మతి ఏందారి పడుతుందో
సందిటపడి కందినమది సంబరపడి చెంగుమంది
వంద ఏళ్ళ జంట నా కుందనాల పంట
నీ విందులేరుకుంటా వేయివందనాలు అంట
కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
చరణం2:
పాలపిట్ట పదారు ప్రాయమిట్టా
పరాయి గాలి వెంట పచారు ఏలనే
పాడు గుట్టే పదంటు పొంగుతుంటే
పరాకు జారుపైటే బజారు ఏలెనే
పంతమాడితే పసందు బొంకమెంతొ పోల్చనా
పొందికైన బంధనాల పంజరాన
కందెమోడితే కసింత కట్టుబడితె పలచన
పిందె ఈడు పిండుకున్న పౌరుషాన
అరె పల్లేరు వానమ్మో అల్లారు ముద్దుబాల ఓ ఓ ఓ
పన్నీటి వాగయ్యో కిల్లారు సంబరాల
పందిరిజత అందిన పసి కందుకు బుసలెందుకుమరి
పొద్దువాలకుండా రేపొద్దు పాల ఎండ
చూపొద్దు వీలుజండా నా ముద్దు పూలచెండా
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీ వన్నె పంచమంటూ నే విన్నవించుకుంటా
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
No comments:
Post a Comment