01 July 2010

అలనాడు బ్రమ్హ మనుషుల తలరాతలు రాయడంలో

అలనాడు బ్రమ్హ మనుషుల తలరాతలు రాయడంలో కాస్త అలసిపోయి తలనొప్పితో బాధపడుతుంటే
సరస్వతి దేవి తీవ్రంగా ఆలోచించి పాలకడలి నుంచి పాలని, శివుడి తలమీద గంగమ్మ నడిగి నీటిని, మన్మధుడి చెరకు విల్లునుంచి చక్కరను, ఊటి ఉద్యానవనం నుంచి తేయాకును తెప్పించి బాగా కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోచి ఇచ్చిందొక చక్కని చిక్కని టీ.....
అది తాగిన బ్రమ్హ ఆనాటినుంచి ఈనాటిదాకా రెష్టులేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు
అలాంటి మహిమ కలిగిన ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్.....
ఆ ఛాయ్ మహత్తును నోరారా చెబుతా.... నోరూరేలా వినుకోవోయ్.....
ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్....... ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్..... ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్
ఏ ఛాయ్ గరీబుకి విందురా భాయ్....... ఈ ఛాయ్ నవాబుకి బంధువేనోయ్
ఏ ఛాయ్ మనస్సుకి మందురా భాయ్..... ఈ ఛాయ్ గలాసుకి జే జే........ ||ఏ ఛాయ్||

డ్రైవర్ బాబులకి ఈ టీలే పెట్రోలు...
డాక్టర్ బాబులకి ఈ టీలే టానిక్కు.....
లేబర్ అన్నలకి టీనీళ్ళే జీతాలు....
విద్యార్ధుల చదువులకి టీలే విటమిన్లు......
తెల్లదొరలు ఇండియాకు తెచ్హారు టీ...... ఆ టీతాగి వాళ్ళతోటి వేశాము భేటి
అన్నాడు అలనాటి ఆ శ్రీ శ్రీ....తాను టీ తాగడంలో ఘనాపాటి
టీ వల్ల లాభాలు శతకోటి........
ఆ లిస్టంత అవుతుంది రామకోటి.... ||ఏ ఛాయ్||

అల్లం టీ కొడితే అది పెంచును ఆరోగ్యం....
మసాలా టీ కొడితే అది దించునురా మైకం....
లెమ్మన్ టీ కొడితే ఇక లేజి మటుమాయం..
ఇరాని టీ కొడితే ఇటురాదా ఆ స్వర్గం....
కేఫుల్లో ధాబాల్లో ఫైవ్ స్టారు హోటల్లో ఎక్కడైన దొరికేది ఏంటి.... అ టీ టీ
సినిమా హాళ్ళల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండ తాగేది ఏంటి..... అ టీ అన్నా
టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు....
టీ కొడితేనే బతుకుతారు అందరు.... ||ఏ ఛాయ్||

No comments: