పల్లవి
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే మహూర్తం మదిలో కదలాడే ||కళ్ళలో||
చరణం 1
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో (2)
పెదవిపై కదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన ||కళ్ళలో||
చరణం 2
సన్నాయి చల్లగ మ్రోగి సన్నీటి పన్నీటి జల్లులే రేగి (2)
మనసైన వరుడు దరిచేరి మెడలోన తాడి
కడుతూంటే జీవితాన పూలవాన ||కళ్ళలో||
చరణం 3
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే
భావియే నందన వనమైతే
జీవితాన పూలవాన ||కళ్ళలో||
No comments:
Post a Comment