పల్లవి:
నిలువవే వాలు కనుల దాన
వయ్యారీ హంస నడక దాన
నీ నడకలో హొయలున్నదే చాన
నువు కులుకుతు గలగల నడుస్తువుంటే
నిలువదే నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
నిలువవే వాలు కనుల దాన
వయ్యారీ హంస నడక దాన
నీ నడకలో హొయలున్నదే చాన
చరణం1:ఎవరని ఎంచుకొనినావో
పరులని భ్రాంతి పడినవో
ఎవరని ఎంచుకొనినావో
భ్రాంతి పడినవో
సిగ్గు పడి తొలగేవో
విరహాగ్నిలో నను తోసి పోయెవో
నువు కులుకుతు గల గల నడుస్తు వుంటే
నిలువదే నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
చరణం2:
ఒక సారి నన్ను చూడ రాదా
చెంత చేర సమయమిది కాద
ఒక సారి నన్ను చూడ రాదా
సమయమిది కాద
చాలు నీ మరియాద
వగలాడి నే నీ వాడనే కాదా
నువు కులుకుతు గల గల నడుస్తు వుంటే
నిలువదే నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
చరణం3:
మగడంతే మోజు లేని దానా
మనసుంటే నీకు నేను లేనా
మగడంతే మోజు లేని దానా
నీకు నేను లేనా
కోపమా నా పైనా
నీ నోటి మాటకే నోచుకొలేనా
నిలువవే వాలు కనుల దాన
వయ్యారీ హంస నడక దాన
నీ నడకలో హొయలున్నదే చాన
నువు కులుకుతు గల గల నడుస్తు వుంటే
నిలువదే నా మనసు
ఓ లలనా ఓ చెలియా ఓ మగువా
అది నీకే తెలుసు
No comments:
Post a Comment