21 July 2010

మోజుల్లోన తుళ్ళి పూచే బంగరుప్రాయం --KalaPani

పల్లవి:

మోజుల్లోన తుళ్ళి పూచే బంగరుప్రాయం రమ్మననే సంతోషంలో
మది తెర తీసా సందేలళ్ళో
మాటిచ్చింది భామ మనసిచ్చింది మామ జట్టుకురా ముద్దులరేడా
మునిమాపుల్లో అల్లరివాడ
వలపుతోపుల్లో మురిపంగా వేచారా నను ముద్దడరా
మోజుల్లోన తుళ్ళి పూచే బంగరుప్రాయం రమ్మననే సంతోషంలో
మది తెర తీసా సందేలళ్ళో

చరణం1:

సింగారం పొంగింది అలబంగరుగాజులు ఎట్టి వయ్యారం ఒడిగట్టి వచ్చితి మావ
ఆశంతా తావెట్టి చిరు ముచ్చట ముగ్గులు ఎత్తి వయసంతా ఆరెట్టి వేచితి మావ
వన్నెల జున్ను తెచ్చాను వడ్డిస్తాను వస్తేను
లడ్లు పాలు పాయసము కొసరుగ పరువం ఇస్తాను
ఆకు వక్క సున్నం గిన్నం సిద్ధం చేసాను
గిల్లి గిచ్చి తుళ్ళి సోలి అల్లుకుపోతాను రావేరా నా మావ
మోజుల్లోన తుళ్ళి పూచే బంగరుప్రాయం రమ్మననే సంతోషంలో
మది తెర తీసా సందేలళ్ళో

హే వెన్నులేసి జొన్నకంకె ఊగె ఒహొహొ
అహ గంతులేస్తు గాలి ఊయలాయె ఒహొహొ
ఈ కంకే ఎంకిగ తోచేనా
ఎదలో వేణువులూదేనా

చరణం2:

మెత్తంగా పరుపేసా ఎద పక్కన సిద్ధం చేసా
అందాలే పాలించ పవళించరా
నా ఒళ్ళోన ఒదిగి తొలిసారిగ హత్తుకుపోరా
నా ఆరాటం నీకోసం వినుకోరా
మొగ్గ బుగ్గన ముద్దట్లు అట్లతద్ది ఆరట్లు హొయ్య హొయ్య హొయ్య
ఒప్పులకుప్ప సిగ్గట్లు గుండెల్లోన తప్పెట్లు హొయ్య హొయ్య హొయ్య
మోజులకొద్ది చెంతకు వస్తే జట్టుగ జాగారం
అచ్చట ముచ్చట పందిట్లోన పున్నమి భాగోతం
ఇది నా మోమాటం

మోజుల్లోన తుళ్ళి పూచే బంగరుప్రాయం రమ్మననే సంతోషంలో
మది తెర తీసా సందేలళ్ళో
వలపుతోపుల్లో మురిపంగా వేచారా నను ముద్దడరా
మోజుల్లోన తుళ్ళి పూచే బంగరుప్రాయం రమ్మననే సంతోషంలో
మది తెర తీసా సందేలళ్ళో

No comments: