22 November 2010

పచ్చిపాల ఒంటి ఈడు చిచ్చిపోమాక

పచ్చిపాల ఒంటి ఈడు చిచ్చిపోమాక
ఇచ్చకాల ముళ్ళు చూపు గుచ్చిపోమాక
పచ్చిపాల ఒంటి ఈడు చిచ్చిపోమాక
ఇచ్చకాల ముళ్ళు చూపు గుచ్చిపోమాక
చిచ్చు పెట్టి చిచ్చి కొట్టి తప్పుకోమాక
తప్పదింక బావయ్యో
తప్పు కాదు లేవయ్యో
మల్లెమొగ్గలాంటి పిల్ల అల్లుకోమంది
బుగ్గలోన సిగ్గు నీకు గిల్లుకోమంది
ముగ్గులోకి దించి మత్తు జల్లుకోమంది
గోల గోలగున్నాది
జోలపాడమన్నాది

అందాల మామ నా చందమామ తానాలకొచ్చావా మావయ్యో
ఒళ్ళంత రుద్ది వయ్యారమద్ది నీళ్ళోయమంటావా
చుక్కంటి పిల్ల సూదంటి నడుము చుట్టేసుకోమంది మావయ్యో
చెక్కిళ్ళ తీపి నొక్కుళ్ళ మీద ఒట్టేసుకోమంది
జోరుమీదుంది అసలే వయ్యారం
తీరిపోవాల కొసరే యవ్వారం
డండ డాడాడ డాడ్డా డాడాడా
ఓయ్ డండ డాడాడ డాడ్డా డాడాడా
ఇక నీకే నా ముద్దు ముడుపులు
నాకే నీ పట్టు విడుపులు
డండరడడ్డ డాడ్డ డండరడడ్డ డాడ్డ

పచ్చిపాల ఒంటి ఈడు చిచ్చిపోమాక
ఇచ్చకాల ముళ్ళు చూపు గుచ్చిపోమాక
చిచ్చు పెట్టి చిచ్చి కొట్టి తప్పుకోమాక
తప్పదింక బావయ్యో
తప్పు కాదు లేవయ్యో

ఉయ్యాలలూగే వయ్యారి భామ సయ్యాటకొచ్చింది మావయ్యో
తెల్లారిపోతే కిల్లాడి వయసు చల్లారిపోతుంది
పిచ్చెక్కిపోయే పిందంటి సోకు పండించుకుంటావా మావయ్యో
ముచ్చట్లు తీరే పందిట్లొ నాతో జంటేసుకుంటావా
సిగ్గు సింగారమిస్తా ఊ అంటే
లగ్గమెట్టించుకొస్తా సయ్యంటే
డడ్డ డాడాడ్డ డాడా డడడాడ్డ
డడ్డ డాడాడ్డ డాడా డడడాడ్డ
అరె వేసేయ్ ముత్యాల పందిరి
చేసేయ్ మురిపాల సందడి
డండరడడ్డ డాడ్డ డండరడడ్డ డాడ్డ

మల్లెమొగ్గలాంటి పిల్ల అల్లుకోమంది
బుగ్గలోన సిగ్గు నీకు గిల్లుకోమంది
ముగ్గులోకి దించి మత్తు జల్లుకోమంది
గోల గోలగున్నాది
జోలపాడమన్నాది
గోల గోలగున్నాది
నిన్ను జోలపాడమన్నాది

No comments: