వేణుగానమ్ము వినిపించెనె
చిన్ని కృష్ణయ్య కనిపించడే ||వేణుగానమ్ము||
దోరవయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను తానేనని ||2||
అంత మొనగాడటే వట్టి కధలేనటే
ఏడి కనబడితే నిలదీసి అడగాలి వాడినే ||వేణుగానమ్ము||
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట ||2||
అంత మొనగాడటే వింత కధలేనటే
ఏడి కనబడితే కనులారా చూడాలి వానినే ||వేణుగానమ్ము||
దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట ||2||
ఘల్లు ఘల్ఘల్లన ఒళ్లు ఝుల్ఝుల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట ||వేణుగానమ్ము||
No comments:
Post a Comment