20 November 2010

రామకథను వినరయ్యా

రామకథను వినరయ్యా
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే సీతా
రామకథను వినరయ్యా

అయోధ్యా నగరానికి రాజు దశరధ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు
కౌసల్యాసుమిత్రాకైకేయీ
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురుఉ
రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులుఆఆ
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే సీతా
రామకథను వినరయ్యా

ఘడియ ఏని రఘురాముని విడచి గడుపలేని ఆ భూజాని
కౌశిక యాగము కాచి రమ్మని
కౌశిక యాగము కాచి రమ్మని
పలికెను నీరదశ్యామునినీ
రామకథను వినరయ్యా

తాటకి దునిమి జన్నము గాచి
తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిధిలకు దాశరధి

రామకథను వినరయ్యా
మదనకోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము
ధరణిజ మదిలో మెరసిన మోదము
కన్నుల వెన్నెల వీచినది
రామకథను వినరయ్యా

హరుని విల్లు రఘునాధుడు చేగొని
ఎక్కిడ ఫెళఫెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల ఆఆఆ
కళకళలాడే సీతారాములఆఆఆఆ
కళకళలాడే సీతారాములఆఆఆఆఆఆ
కళకళలాడే సీతారాములఆఆఆఆఆఆ
కన్నులు కరములు కలిపినవి

రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే సీతా
రామకథను వినరయ్యా

No comments: