14 November 2010

రాజహంసవో రాత్రి హింసవో రాచిలకా రావే

రాజహంసవో రాత్రి హింసవో రాచిలకా రావే
ఓ రసరంభా రావే
కంటి మన్మధా జంట తుమ్మెద సరసానికి రారా
నీవరసే రుచిలేరా
వయ్యారి గోదారి నీఒళ్లోనే ఈదేస్తా
అందాల గంధాలల్లి మెళ్లోనే పూసేస్తా
సరిపద మరి నీదే ఆలస్యం
సరిగమపద నీకే ఆహ్వానం ||రాజ||

శ్రీ చిలకమ్మ కులుకు సింగారాలే చిలుకు
ఊహల్లో నీ ఉలుకు తొలిమోహంలోనే పలుకు
విరహాల వీణలే సరసంగా మీటనా
అధరాల తేనెతో మురిపాలు పంచనా
సిగ్గేమొగ్గలై విచ్చేనులే
నీ బుగ్గసిగ్గులే తేలేనులే
అన్నీ నీవని వచ్చానుగా
నాకన్నె మనసునే ఇచ్చానుగా ||రాజ||

వరకట్నంగా వయసు అది ముట్టిందంటే అలుసు
ఇచ్చేసా నామనసు ఇకరానే రాదని తెలుసు
వయసమ్మ వాంఛలు వలలెన్నో వేయగా
కౌగిళ్ళ కంచెలు కసిఈడు మేయగా
ముద్దుముచ్చటే ఈరాతిరి సరిహద్దే లేనిది నీ అల్లరి
ఎన్నాళ్లాగునమ్మ ఈ కోరిక
మన తాంబూలాలకే తయ్యారుగా ||రాజ||

No comments: