గుడిలో దేవుని గంటలా
నా హృదిలో ఆరని మంటలా
కలలు కన్న కన్నె వలపులు గాలిగోపుర దీపాలా ||గుడిలో||
ఆలయమందున దేవుడు వున్నా మనుషులందరికీ మనసులు వున్నా ||2||
ఆలకించరా ||2||
ఆవేదనలూ ఆదరించరా అనురాగాలు ||గుడిలో||
ప్రేమించిన మా పసి హృదయాలను శాసించెనుగా మీ ద్వేషాలు ||2||
దేవుడు రాసిన వ్రాతలా ఇది పెద్దలు చేసిన చేతలా ||గుడిలో||
తొలిప్రేమను చవిచూపిన తల్లే విధి లేదనుకుని విడదీసినదా ||2||
ఈ విషబిందువు చిందినదెవరో జీవిత మెడారి చేసినదెవరో ||గుడిలో||
No comments:
Post a Comment