15 November 2010

పదపద పదరా పాటుపడరా

పదపద పదరా పాటుపడరా
పంచవన్నె చిలకను పట్టవచ్చురా
వయసుంది కదరా వలపు వలలా
తెలివిగ వాడుకుని బాగుపడరా
కోలారు గనివంటి కోటీశ్వరుడి
ఇంటి ఏకైక కూతురికి ఎరవెయ్ సోదరా
పూలబాణ మేయరా
కోహినూరు మణిలాంటి కన్యాకుమారితో
కళ్యాణమైతే చాలు జాకుపాటు నీదిరా
ప్రేమబాధ చూడరా ||పద||
హలో ప్రేమికా ||2|| ఏది ఎటు తమిరి రాక
మరీ ఎంటిదాన్ని తమకు తారక
తోటరాముడైతే నువ్వు నేనే రాకుమారి
కోటతోవ తెలిసిందంటే లక్కీ లాటరీ నీదేరా మరి ||పద||

ఖరీదైన ప్రాయం నీది ఒరేయ్ బ్రహ్మచారీ
వరాలన్నీ అందిస్తుంది
పెట్టుబడిగ మారి
ఒకే ఒక్క మార్గం నీది అదేరా పునాది
వరించాలి ఓ షహజాదీ
నిన్ను ఏరికోరి
నిఖార్సయిన వంశం చూసి మెగా ప్లానువేసి
సనిన్ లాగా సెటిలైపోరా అదే పూలదారి
చలో బ్యాచిలర్ ||2|| నీది తిరుగులేని తీరి
హలో మైడియర్ అంది స్వర్గసుందరి ||పద||

కలెక్టర్‌వి అయినా గాని ఘరానా కహాని
నెలాఖర్న ఏమొస్తుంది కాస్త సాలరీ
కలల్లోన చూసేవన్నీ కొనే వీలుల్లేని
పనేదైనా ఫలితం మాత్రం, వెట్టి చాకిరి
మిలియనీరు అయొతేగాని మజాలేదు జానీ
వెరైటీగా ఆలోచించి, రూటు మారిపోనీ
వారెవ్వా గురూ ||2|| ఓహొ బలేగుంది నీజోరు
శభాషందురు చూసే జనాలందరు ||పద||

No comments: