మనిషి మనిషికి ఓ చరిత్ర
మనిషి మనసులో మరో చరిత్ర
సగము వినోదము..సగము విషాదము
ఇంతే ఈ లోక చరిత్ర
తూరుపులో ఉదయించే సూర్యుడు
పడమరలో కుంగకుండ మానడు
మనుగడ విలువలు..చీకటి వెలుగులు
మనిషికి ఇవి రోజూ పాఠాలు
ఈ సత్యం అను నిత్యం
తెలుసుకున్న నాడు రావు కొరతలు
సంసారం అన్నది ఒక శతకము
దాంపత్యం అది సాగే మార్గము
పతి ఒక చక్రము..సతి ఒక చక్రము
కలిసి మెలిసి సాగితే స్వర్గము
కాదంటే లేదంటే అంతకన్న ఏముంది నరకము
మనిషికి మనిషికి ఓ చరిత్ర
ప్రతి మనిషిది ఒక పాత్ర
ఎన్నో రకాలుగా..ఎవో మతాలుగా
సాగే అనంత యాత్ర
మహరాజు వెలిసాడు ఈ ఇంతిలో
కొలువే తీరాడు పొరుగింటిలో
వయసే మీరినా బరువు భాద్యత
తెలియదు పాపం పసివాడికి
మతి లేదా..శ్రుతి లేదా
బ్రతుకు విలువ ఎవరు అతనికి తెలిపేది
లోకానికి వున్నవి నలు దిక్కులు
ఆ ఇంటికి ఉన్నవి ఇరు దిక్కులు
భర్తే తూరుపు..భార్యే పడమరి
దిక్కులేదు పాపం పసిదానికి
ఎవరమ్మా..ఎవరమ్మా జరుగుతున్న కధను మలుపు తిప్పేది
భర్తే ఒడే ఆ భార్యకు కోవెల
భర్త నీడ కాశి ప్రయాగ
ఆకలి దప్పులే ఎరుగని ప్రేమలా
కలిసి మెలిసి జీవించే ఇంటిలో
అటు లేమి..ఇటు కలిమి
నడుమ నలుగుతున్న కధకు తుది ఏది
No comments:
Post a Comment