నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ||2||
ఈ గుండలోనా నీ ఊపిరంటూ నీ కళ్లలోనా నీ కలలు ఉంటే ఊహల
రెక్కలపైనా ఊరేగే దారులు ఒకటి
చూపులు ఎవ్వరివయినా చూపించే లోకం ఒకటి ||నేస్తమా||
మరి లోకంలో ఎన్ని రంగులుంటాయి అవి ఎలా ఉంటాయి
బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనమంటే చెబుతుందీ
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమయిన నీ చిరునవ్వు
తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువుల పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరుని అవుతానమ్మా దిగులు
రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే
ప్రతిరంగును చూస్తున్నట్లే చూపులు ఎవ్వరివయినా
చూపనిపించే లోకం ఒకటే ||నేస్తమా||
మొదటి సారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి
ఆ కదలికే ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిసావనుకో సాయంత్రం అయినట్లేనమ్మా
నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ
జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే ||నేస్తమా||
No comments:
Post a Comment