ఇప్పటి కిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల వత్తిళ్లో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్లో
మనసును మేలుకొమ్మని కదిపి కుదిపి సరదాల సందడి
ప్రేమకు వేళయ్యిందని తరిమి తడిమి తరుణాల తాకిడి
ఏం చెయ్యమంది కొంటే అల్లరి ఆమాట చెప్పదు ఎల్లా మరి
మాటలేని ఒడ్డు చేరుకోమని
చిలికి చిలికి ఉలికిపడే చిలిపి వలపు చినుకు సడి ||ఇప్పటి||
సరసకు చేరలేదు ఇన్నాళ్లు అలజడి రేపుతున్న తొందర్లు
పరిచయమైన లేదు ఏనాడు శిరసును వంచమన్న బిడియాలు
సరదాగా మెదలైన శృతి మించే ఆటలో
నను నేనే మరిచానా మురిపించే మత్తులో
ఏమైనా ఈ మాయ బాగుందిగా
ఆకాశ మార్గాన సాగిందిగా
ముడి పడిపడి వీడనంది నూరెళ్ల సంకెల ||ఇప్పటి||
కనపడలేదు మునుపు ఏనాడు కనులకు ఇన్నివేల వర్ణాలు
తెలియనే లేదు నాకు ఏనాడు తలపునకు గిల్లుతున్న వైనాలు
పెదవుల్లో విరబూసే చిరునవ్వుల కాంతిలో
ప్రతిచోట చూస్తున్నవి ఎన్నెన్ని వింతలో
తొలిసారి తెలవారే నీయీడుకి
గిలిగింత కలిగింది ఈనాటికి
జతపడి సాగమంది కైగిళ్లవాడకి ||ఇప్పటి||
No comments:
Post a Comment