08 May 2010

ఆకాశమా నీవెక్కడా అవని పైనున్న నేనెక్కడ

ఆకాశమా నీవెక్కడా అవని పైనున్న నేనెక్కడ
ఆకాశమా నీవెక్కడా అవని పైనున్న నేనెక్కడ
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా నిలువగలనా నీ పక్కనా
ఆకాశమా నీవెక్కడా అవని పైనున్న నేనెక్కడ

నీలాల గగనాల ఓ జాబిలి
నిను నిరుపేద ముంగిట నిలుపేదెలా
నీలాల గగనాల ఓ జాబిలి
నిను నిరుపేద ముంగిట నిలుపేదెలా
ముళ్ళున్న రాళ్ళున్న నా దారిలో
నీ చల్లని పాదాలు సాగేదెలా
నీ మనసన్నది నా మది విన్నది
నిలిచిపోయింది ఒక ప్రశ్న లా
నిలిచిపోయింది ఒక ప్రశ్న లా

ఆకాశమా ఆ ఆ నీవెక్కడా
ఆకాశమా నీవెక్కడా
అది నిలిచి వుంది నీ పక్కన
వేల తారకలు తలలో వున్నా
వేల తారకలు తలలో వున్నా
నేల పైనే తన మక్కువ
ఆకాశమా నీవెక్కడా
అది నిలిచి వుంది నీ పక్కన

వెలలేని నీ మనసు కోవెలలో
నను తలదాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో
నను తలదాచుకోని చిరు వెలుగునై
వెను తిరుగని నీ నడకలో
నను కడదాక రానీ నీ అడుగునై
మన సహ జీవనం వెలుగించాలిలే
సమతా కాంతులు ప్రతి దిక్కున
సమతా కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడా
అది నిలిచి వుంది నీ పక్కన
వేల తారకలు తలలో వున్నా
వేల తారకలు తలలో వున్నా
నేల పైనే తన మక్కువ
ఈ నేలపైనే తన మక్కువ
లాలా లలా లాలా లలా
లల లలల లాలా లాలా లలా

No comments: