05 February 2011

నువ్విలా ఒక్కసారిలా అరె ఏంచేసావే నన్నిలా

నువ్విలా ఒక్కసారిలా అరె ఏంచేసావే నన్నిలా
కోయిల ఎందుకోఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
గుండెలోపల వుండుండి ఏంటిలా
ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా

నువ్విలా నువ్విలా ఒక్కసారిలా
అరె ఏంచేసావే నన్నిలా
కోయిల ఎందుకోఇలా
నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా

చూడాలి చూడాలి అంటూ నీ తోడె కావలి అంటూ
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల
ఇంతందం ఇన్నాల్ల నుండి దాక్కుంటూ ఏ మూల ఉంది
గుండెల్లోన గుచ్చేస్తుంది సూదిగా
పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే
కొంచెం గమ్మత్తుగుంది కొంచెం ఖంగారుగుంది
అంతా చిత్రంగ వుంది ఈ రోజు ఏమైందిలా

నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఏంచేసావే నన్నిలా
కోయిల ఎందుకోఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా

చంద్రుండ్ని మింగేసిందేమో వెన్నెల్ని తాగేసిందేమో
ఎంతెంతో ముద్దొస్తున్నది బొమ్మలా
తారల్ని ఒల్లంత పూసి మబ్బుల్తో స్నానాలు చేసి
ముస్తాబై వచ్చేసిందేమో దేవత
మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే
నన్నే లాగేస్తున్నట్టు నీపై తోసెస్తున్నట్టు
ఏంటో దొర్లేస్తున్నట్టు ఏదేదో అవుతోందిలా

నువ్విలా ఒక్కసారిలా అరె ఏంచేసావే నన్నిలా
కోయిల ఎందుకోఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
గుండెలోపల గువ్వలగుంపులా ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా

నువ్విలా ఒక్కసారిలా అరె ఏంచేసావే నన్నిలా
కోయిల ఎందుకోఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips