23 February 2011

ఇలాగే ఇలాగే సరాగమాడితే

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

వయసులో వేడుంది మనసులో మమతుంది
వయసులో వేడుంది మనసులో మమతుంది
మమతలేవో సుధామయం మాటలేవో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

కంటిలో కదిలేవు జంటగా కలిసావు
కంటిలో కదిలేవు జంటగా కలిసావు
నీవు నేను సగం సగం
కలిసిపోతే సుఖం సుఖం
తనువూ మనసు తనివి రేపునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
రరరర లలలల రరరర లలలల

భావమే నేనైతే పల్లవే నీవైతే
భావమే నేనైతే పల్లవే నీవైతే
ఎదలోన ఒకే స్వరం కలలేవో నిజం నిజం
పగలు రేయి ఏదో హాయి
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
ఊయలూగునే హాహ హాహహా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips